టాలీవుడ్ లో శ్రీదేవి నటిగా అందగాత్తగా ఎంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ని వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఆ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది శ్రీదేవి. అయితే శ్రీదేవి కోరిక ను బోని కపూర్ ను ఒక కోరిక కోరిందట. అది కేవలం బోనికపూర్ ధూమపానం మానేయాలని సూచించినట్లుగా తాజాగా ఒక ఇంటర్వ్యూలోకి వచ్చి తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో ఒక హోటల్లో బాత్రూంలో మరణించింది. అయితే శవ పరీక్షలు ప్రమాదవశాత్తు నీట మునిగి మరణించినట్లుగా వైద్యులు తెలియజేయడం జరిగింది. ఇక శ్రీదేవి,బోనీ కపూర్ కుమార్తెలే జాన్వీ కపూర్, ఖుషి కపూర్. శ్రీదేవి కుటుంబం ఆమెను చాలా మిస్ అవుతోంది అంటూ ఎన్నోసార్లు తెలియజేయడం జరిగింది. ఇటీవల బోనీకపూర్ ది కపిల్ శర్మ షో లో కనిపించారు. స్మోకింగ్ మానేయమని తనను తన భార్య శ్రీదేవి కోరినట్లుగా తెలియజేశారు.అయితే శ్రీదేవి మరణించిన తర్వాత అతను ధూమపానం తిరిగి ప్రారంభించానని తెలియజేశారు.
శ్రీదేవి మరణించిన సమయంలో తాను మూడు నాలుగు రోజులు దుబాయ్ లో ఉన్నానని తాను ఒంటరిగా ఉన్నందుకు మానసిక ఆవేదన చెందానని తెలియజేశారు. దాంతో సిగరెట్లు మొదలు పెట్టానని తెలియజేయడం జరిగింది శ్రీదేవి తనను ధూమపానం విడిచి పెట్టమని మొదట అభ్యర్థించినప్పుడు తన పైన ఉన్న ప్రేమ భరోసా తనకు కనిపించింది అని అందుకే మానేశానని తెలిపారు. కానీ ఇప్పుడు తను లేకపోవడంతో తనని తలుచుకొని సిగరెట్టు తాగుతూ ఉంటానని తెలిపారు నిర్మాత బోనికపూర్.