పాప్ కార్న్ అమ్ముతున్న స్టార్ డాటర్..ఎందుకో తెలిస్తే..నొరెళ్లబెటేస్తారు..!!

సినిమాలు తెరకెక్కించడం పెద్ద మ్యాటర్ కాదు ..సినిమాను తెరకెక్కించిన తర్వాత ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడమే మెయిన్ పాయింట్. ఇప్పటివరకు ఈ విషయంలో ఎస్ఎస్ రాజమౌళి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు . ఆయన సినిమా తీసే టైమ్ లోను కష్టపడతాడు.. తీయడానికి కష్టపడతాడు.. తీసింది జనాల దగ్గరకు తీసుకెళ్లడానికి కష్టపడతాడు.. అందుకే ఆయన ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అందుకోలేదు .

దర్శకధీరుడుగా ఇండస్ట్రీ ను ఏలేస్తున్నాడు .కాగా ప్రజెంట్ ఆయన స్ట్రాటజీలని ఫాలో అవుతుంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్. మనకు తెలిసిందే శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన జాన్వీ కాపూర్ మొదటి సినిమా ధడక్ తోని అభిమానులను సంపాదించుకుంది. ఇక తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. రీసెంట్గా జాన్వీకపూర్ నటించిన సినిమా మిల్లి. ఈ చిత్రం నవంబర్ 4న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కానుంది.

ఈ క్రమంలోనే ఆమె సినిమా ప్రమోషన్స్ చురుగ్గా పాల్గొంటుంది . కాగా వెరైటీగా సినిమా ప్రమోషన్స్ చేయడానికి జాన్వి కపూర్ రీసెంట్గా ఢిల్లీలోని ఓ థియేటర్లో పాప్ కార్న్ అమ్మింది. దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . ఢిల్లీలోని ఓ థియేటర్లో ఫ్యాన్స్ కు స్వయంగా పాప్ కార్న్ సర్వ్ చేసింది . కౌంటర్ వెనక నుండి జాన్వి పాప్ కార్న్ సర్వ్ చేయడం చూసిన ఫ్యాన్స్ సెల్ఫీలు ఫోటోలతో అట్రాక్ట్ చేశారు. ఈ క్రమంలోనే జాన్వి సినిమా తప్పకుండా చూస్తామని ఆ సినిమా హిట్ అవుతుందని అక్కడ అభిమానులు చెప్పుకొచ్చారు . చూద్దాం జాన్వి ప్రమోషన్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో..?

 

Share post:

Latest