కొడుకుని రంగంలోకి దింపుతున్న సింగర్ సునీత, నిర్మాత ఈయనే?

టాలీవుడ్ లో వారసుల హవా రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఈ కోవలోనే సింగర్ సునీత కొడుకు నిలవబోతున్నాడు. అవును, టాలీవుడ్ లో సింగర్ సునీతకి వున్న స్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమె వారసత్వం గానంలో కాకుండా నటనలో చూపించబోతోంది. సునీత తెలుగులో సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది. అలాగే ఆమెకి ఇక్కడ పరిచయాలు కూడా ఎక్కువే. ఎందుకంటే ఆమె ప్రముఖ గాన గంధర్వుడు అయినటువంటి SP బాలు గారికి స్వయానా బంధువు.

ఇక బాలుగారికి వున్న పేరు గురించి ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు. ఆ సర్కిల్ అంతా సునీతకు అండగా నిలవనుంది. ఇకపొతే ఆమెకు హీరో అయ్యేంత కొడుకు ఉన్నాడంటే చాలా మంది నమ్మరు. అయితే ఇక్కడ ఫోటోలు చూస్తే మీకే అర్ధం అవుతుంది. అవును, సునీత తనయుడు ఆకాశ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సునిత తన మొదటి భర్త నుంచి విడిపోయి.. పిల్లలను తానే కష్టపడి పెంచింది. చాలా కాలంగా భర్తతో దూరంగా ఉన్న ఆమె ఈ మధ్యనే మరో వ్యక్తిని పెళ్ళి చూసుకున్న విషయం విదితమే.

ప్రముఖ వ్యాపార వేత్త.. మ్యాంగో వీడియోస్ అధినేత అయినటువంటి రామ్ వీరపనేనిని ఆమె రెండో పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడుపుతోంది. ఇక ఆకాష్ ను హీరోగా పరిచయం చేయడానికి రామ్ వీరపనేని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని వినికిడి. ఈ విషయంపై సునీత కూడా ఆమధ్య క్లారిటీ ఇచ్చారు. ఆకాశ్ ను హీరోగా పరిచయం చేయబోతున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె తన కొడుకు సిల్వర్ స్క్రీన్ మీదకు వస్తున్నాడని, అతన్ని అందరూ ఆశీర్వదించాలని వేడుకుంది. ఇకపోతే ఏ సినిమా చేయబోతున్నాడు? దర్శకుడు ఎవరు? బ్యానర్ ఏమిటి? అన్న విషయాలు మీద ఇంకా క్లారిటీ రావలసి వుంది.

Share post:

Latest