40 ఏళ్ల వయసులో కూడా పరువాల పదరా పరుస్తున్న శ్రీయ శరన్!

టాలీవుడ్ అందాల పట్టి శ్రీయ శరన్ గురించి తెలియని కుర్రకారు ఉండరంటే అతిశయోక్తి లేదు. దాదాపుగా రెండు దశాబ్దాలుగా శ్రీయ టాలీవుడ్ లో పాతుకుపోయింది. తనదైన నటనతో టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించి ఓ వెలుగు వెలుగొందింది. సీనియర్స్, జూనియర్లు అనే తేడా లేకుండా అందరితోనూ ఈ అమ్మడు నటించి మెప్పించింది. ఇంకా నేటికీ ఆమె నటిగా కొనసాగుతూనే ఉంది. హీరోయిన్లకు వయసు పెరిగే కొద్దీ ఆఫర్స్ తగ్గడం సహజం. అయితే శ్రీయ విషయంలో అది వర్తించదు. వయసు పెరిగే కొద్దీ అందం కూడా ఆమెని వీడి వెళ్లనంటోంది.

ఇటీవల ఆమెకు బాలీవుడ్ నుండి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే అజయ్ దేవగన్ సరసన నటించిన దృశ్యం 2 రిలీజై సూపర్ సక్సెస్ పొందిన సంగతి విదితమే. అలాగే శ్రీయ రీసెంట్ గా గమనం చిత్రంలో ప్రేక్షకుల ముందు రాగా శ్రీయ నటనకు ప్రశంసలు దక్కాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయా తరచుగా తన ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా బికినీలో శ్రీయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

40 ప్లస్ ఏజ్ లో కూడా కుర్ర భామలకు దీటుగా తన ఫిజిక్ ఏమాత్రం తక్కువ కాదంటూ అందాల ఆరబోతకు రెడీ అయింది. అవును, తాజాగా శ్రీయ ఓ ఫోటో షూట్ లో ఘాటుగా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. వైట్ డిజైనర్ శారీలో శ్రియా చిరునవ్వులు చిందిస్తూనే కుర్రాళ్ళ కోర్కెలకు పరీక్ష పెట్టింది. నడుము, క్లీవేజ్ అందాలు చూపించేలా వయ్యారంగా బాడీని మెలికలు తిప్పుతూ, డ్యాన్స్ చేస్తూ కనిపించింది. నాలుగు పదుల వయసులో కూడా శ్రీయ నాజూకు తనం చూసి నెటిజన్లలో ఆడవాళ్లు కుళ్ళుకుంటున్నారు.