టాలీవుడ్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత తాజాగా యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ తో అభిమానులను సంతోషపరిచిందని చెప్పవచ్చు. అయితే ఈ సినిమా సమంత మెయిన్ అట్రాక్షన్ కావడంతో ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడడమే కాకుండా.. బడ్జెట్ భారం కూడా పెరిగిపోయింది. మొదటిరోజు యశోద మూవీ తక్కువ మొత్తంలో కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కూడా అసాధ్యమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నాన్ థియేటర్ హక్కులు ఎక్కువ మొత్తానికి అమ్మడం వల్ల ఈ సినిమాకు ప్లస్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఇతర రాష్ట్రాలలో మాత్రం ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఇతర రాష్ట్రాలలో లక్షలలో మాత్రమే కలెక్షన్లు వస్తున్నాయి. సినిమాలలో హీరో పాత్రలలో తెలుగులో అంతో ఇంతో పాపులర్ అయిన తెలుగు హీరోలను మాత్రమే ఎంపిక చేసుకుంటే ఈ సినిమాకు బెనిఫిట్ కలిగి ఉండేది అంటూ పలువురు నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. పెద్దగా గుర్తింపు లేని హీరోలు సమంతకు జోడిగా నటిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు సమాచారం.
సమంత తన సినిమాల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సినిమా సినిమాకు తన రేంజ్ పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా సమంత ఒక్కో సినిమాకి రూ.5 కోట్ల రూపాయలు అటు ఇటుగా అందుకుంటోందని సమాచారం. సమంత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాగానే సక్సెస్ఫుల్గా తన కెరీర్ ని కొనసాగుతోందని చెప్పవచ్చు. సమంతకు కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం మంచి గుర్తింపు ఉంది. మరి సమంత తన తదుపరి చిత్రాలలో ఇలాంటి తప్పు లేకుండా చేస్తుందేమో చూడాలి మరి.