ఆలీ పెద్ద జాదూగాడు.. నిక్కర్ బటన్ పెట్టుకోమని చెప్తే అంత పని చేశాడా..!

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స్టార్ కమెడియన్ ఆలీ గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ప‌క్క సినిమాల్లో కమీడియన్ గా నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నాడు.
ఇక వీటితో పాటు ఈటీవీలో ఆలీతో సరదాగా టాక్ షోకు వ్యాఖ్యాతిగా కూడా విహరిస్తున్నాడు. ఈ షోలో ఈ తరం న‌టులు పాత తరం నటులు పాల్గొంటూ వారి జ్ఞాపకాలను పంచుకుంటూ ఉంటారు. ఇక తాజా ఈ షోలో సీనియర్ నటి తులసి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రభాస్ శీను పాల్గొన్నారు.

ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో వీళ్ళిద్దరూ మాట్లాడుతూ… ప్రభాస్- శ్రీను తులసిని అక్క అంటూ పిలుస్తానని చెప్పుకొచ్చాడు.. ఇక డార్లింగ్ సినిమా దగ్గరనుంచి ప్రభాస్ నేను మంచి స్నేహితులుగా మారామని కూడా ప్రభాస్ శీను చెప్పారు. ఈ ప్రోమో మొత్తం వినోదాత్మకంగా సాగింది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తులసి చిత్ర పరిశ్రమలో మూడు నెలల పసిబిడ్డగా ఉన్నప్పుడే ఆమె అడుగుపెట్టినట్టు తెలిపింది.

” మూడు నెలల అప్పుడు సినిమాకు పరిచయం అయ్యాను.. మూడు సంవత్సరాలకి డైలాగ్ చెప్పాను.. 100 సంవత్సరాల చిత్ర పరిశ్రమంలో నేను 56 ఏళ్లుగా ఉంటున్నాను..” ఇక నేను ఆలీతో చిన్నప్పుడే కలిసి నటించానని ఈమె చెప్పింది. తులసి- ఆలీ ఒక సినిమా షూటింగ్ సమయంలో చేసిన అల్లరి పని గురించి చెప్పుకొచ్చింది. ” నాలుగు స్తంభాల ఆట సినిమా షూటింగ్ సమయంలో నాకు ఆలీ సైట్ కొట్టేవాడు.. ఆ టైంలో ఆలీ చాలా చిన్నగా ఉన్న పెద్ద జాదూగాడు..” అని చెప్పగా ఆలీ ” నేను అప్పుడు నిక్కర్ వేసుకుని బటన్ పెట్టుకోలేదు.. అప్పుడు తులసి చూసి ఒరేయ్ బటన్ వేసుకోలేదు రా అని నవ్వింది. అప్పుడు వెంటనే నేను కోతి చేష్టలతో ఆమెను ఏడిపించాను” అని చెప్పాడు. ఇక ప్రభాస్ శీను మందు బాగా తాగుతానని ఆ సమయంలో చేపలతో మాట్లాడతానని కూడా చెప్పి నవ్వులు పూయించాడు. ఇప్పుడు ఈ ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

Share post:

Latest