గుంటూరు వైసీపీలో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు..!

మూడు రాజధానులతో మూడు ప్రణతల్లో రాజకీయంగా పైచేయి సాధించవచ్చనే ప్లాన్ అధికార వైసీపీ వేసిన విషయం తెలిసిందే..అయితే ఈ ప్లాన్ పెద్దగా వర్కౌట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. ఎలాగో గొడవ లేకుండా అమరావతి రాజధానిగా ఉంటే..మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేగినట్లు కనిపిస్తోంది. ఈ కాన్సెప్ట్ వల్ల వైసీపీకి కాస్త నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి ప్రాంత పరిధిలో వైసీపీకి భారీగానే నష్టం జరిగేలా ఉంది.

అది కూడా గుంటూరు జిల్లాలో వైసీపీకి భారీ దెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది..పైగా అమరావతి ఇష్యూ, అలాగే ఆధిపత్య పోరు వల్ల వైసీపీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఈ డ్యామేజ్‌కు కాస్త చెక్ పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకనే కొందరి సీట్లు మార్చాలని చూస్తున్నారని కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మంగళగిరిలో నెగిటివ్‌లో ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి..అక్కడ ఉన్న అంబటి రాంబాబుని రేపల్లె లేదా అవనిగడ్డకు పంపిస్తారని టాక్.

ఇక తాడికొండ సిట్టింగ్ ఎమ్మెలే శ్రీదేవికి ఈ సారి సీటు లేదని క్లారిటీ వచ్చేస్తుంది. తాడికొండని డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు గాని, ఎంపీ నందిగం సురేశ్‌కు ఇస్తారని సమాచారం. చిలకలూరిపేటలో ఉన్న మంత్రి విడదల రజినికి గుంటూరు వెస్ట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అటు నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పొన్నూరు సీటు అడుగుతున్నట్లు తెలిసింది.

అటు వినుకొండ, బాపట్ల సీట్లలో కూడా క్లారిటీ రావడం లేదు. మంత్రి మేరుగు నాగార్జునని ఈ సారి వేమూరు కాకుండా, బాపట్ల ఎంపీగా బరిలో దింపుతారని అంటున్నారు. ఇలా కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వకుండా, మరికొందరి సీట్లు మార్చే ప్రయత్నాలు గుంటూరు వైసీపీలో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఎక్స్‌ఛేంజ్ ఏ మాత్రం జరుగుతాయో చూడాలి.

Share post:

Latest