బాక్సాఫీస్ వ‌ద్ద‌ `య‌శోద‌` మాస్ ర‌చ్చ‌.. 2వ రోజుకే స‌గం టార్గెట్ అవుట్‌..!

సమంత టైటిల్ పాత్రలో హ‌రి-హ‌రీష్ ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న సస్పెన్స్ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ `యశోద`. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ త‌దిత‌రులు కీల‌క పాత్రల‌ను పోషించారు.

నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను ద‌క్కించుకుంది. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద బీభత్సం సృష్టించిన య‌శోద.. 2వ రోజుకే దాదాపు స‌గం టార్గెట్‌ను రీచ్ అయిపోయి మాస్ ర‌చ్చ క్రియేట్ చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 1.70 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేసిన ఈ చిత్రం.. 2వ రోజు అంత‌కు మించి రూ. 1.76 కోట్ల రేంజ్‌లో షేర్‌ను రాబ‌ట్టింది. ఇక‌ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 2.82 కోట్ల షేర్‌ను క‌లెక్ట్ చేసింది. ఇక ఏరియాల వారీగా య‌శోద 2 డేస్ వరల్డ్ వైడ్ టోటల్ కలెక్షన్స్ ఓసారి గమనిస్తే..

నైజాం: 1.65 కోట్లు
సీడెడ్: 37 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 40 ల‌క్ష‌లు
తూర్పు: 23 ల‌క్ష‌లు
పశ్చిమ: 13 ల‌క్ష‌లు
గుంటూరు: 23 ల‌క్ష‌లు
కృష్ణ: 22 ల‌క్ష‌లు
నెల్లూరు: 11 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ = 3.39 కోట్లు(5.90కోట్లు~ గ్రాస్‌)
———————————-

తమిళం – 38 ల‌క్ష‌లు
క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా – 45 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌ – 1.54 కోట్లు
———————————-
టోటల్ వరల్డ్ వైడ్ – 5.76 కోట్లు(12కోట్లు~ గ్రాస్)
———————————-

కాగా, రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. ఇంకా రూ. 6.24 కోట్ల షేర్‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి ఈ టార్గెట్‌ను స‌మంత ఎంత తొంద‌ర‌గా రీచ్ అవుతుందో చూడాలి.

Share post:

Latest