ఆ విషయంలో ఫెయిల్ అయిన సమంత…కన్నడ హీరోనే ది బెస్ట్..!!

చాలా రోజుల నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సినిమాలు విడుదలవుతున్న కానీ, ఎంత సూపర్ హిట్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లు రాబట్టడంలో ఫెయిల్ అవుతున్నాయి. ప్రధానంగా డబ్బింగ్ సినిమా అయిన కాంతారా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 40 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇక ప్రస్తుతం వస్తున్న ఏ తెలుగు సినిమా కూడా కాంతారా కలెక్షన్ ను బీట్ చేస్తుందా లేదా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల సినిమాలు కాంతారా కలెక్షన్లను క్రాస్ చేయడం పెద్ద విషయం కాదు కానీ.. టాలీవుడ్ లో ఉన్న చిన్న సినిమాలు ఈ కలెక్షన్ బీట్ చేస్తేనే కిక్కుంటుంది.

Kantara 12 days Hindi collections, Withstands the opposition poses by new  releases

తెలుగులో ఎన్నో చిన్న సినిమాలు విడుదలయ్యాయి.. వాటిలో కొన్ని సినిమాలు కి బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ వచ్చిన ఆ సినిమా కలెక్షన్లు ఆశాజనకంగా లేవు. ఆ టైంలోనే సమంత యశోద సినిమా వస్తే కాంతారా సినిమా కలెక్షన్లను బీట్ చేస్తుందని అందరూ భావించారు. ఇక టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా అదే హోప్ తో ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే కాంతారా కలెక్షన్లను బీట్ చేయడం సమంతాకి కూడా కష్టమని తెలుస్తుంది.

సమంత యశోద విడుదలైన తొలి వారంలో 8 కోట్ల షేర్ ను రాబట్టింది. ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు కొంత తగ్గాయి. ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం గా 10 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ వారంలో కొత్త సినిమాలు లేకపోవడంతో యశోద సినిమా కలెక్షన్లు కొంత పెరిగినా కూడా.. కాంతారా తరహా కలెక్షన్లు రాబట్టం కష్టమే. ఇప్పటికీ కూడా కొన్ని థియేటర్లో కాంతారా సినిమా ఫుల్ రన్ తో నడుస్తూనే ఉంది. సమంత చేయలేని పని టాలీవుడ్ లో ఉన్నా ఏ చిన్న హీరోకి సాధ్యమవుతుందో లేదో అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Share post:

Latest