స‌మంత పిచ్చి ప‌ని.. చేతులారా రెండు గోల్డెన్ ఆఫర్స్ వ‌దిలేసింది!?

సమంత.. సౌత్ లో ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన రోల్స్ ను పోషించి ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తెలుసో తెలియకో సమంత తన కెరీర్ లో పలు గోల్డెన్ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసింది. రీసెంట్ గా కూడా స‌మంత రెండు భారీ ప్రాజెక్ట్స్ ను చేతులారా వదులుకుంది.

అందులో `పుష్ప` ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రమిది. రష్మిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రం.. గ‌త ఏడాది డిసెంబర్ 17న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇందులో సమంత ఐటెం సాంగ్ లో మెరిసింది. అయితే నిజానికి ఈ సినిమాలో సమంతను హీరోయిన్గా నటించాలని మేకర్స్ కోరారట‌. కానీ పలు కారణాల వల్ల ఆమె ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసిందట.

అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్-అట్లీ కాంబినేషన్లో `జవాన్` అనే సినిమా తెరకెక్కుతున్న‌ సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాల్లోనూ మొదట హీరోయిన్‌గా సమంతని సంప్రదించారట. కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల జవాన్ సినిమాను చేయలేనని తెలిపిందట.

దాంతో సమంత స్థానంలో నయనతారను ఎంపిక చేశారని అంటున్నారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు అర‌రే స‌మంత ఎంత పిచ్చి పని చేసింది అంటూ నిరాశపడుతున్నారు. ఏదేమైనా ఈ రెండు ప్రాజెక్టులు చేసుంటే సమంత క్రేజ్ మరింత పెరిగేది అన‌డంలో సందేహ‌మే లేదు. కాగా, సమంత‌ రీసెంట్గా `యశోద` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. పాన ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబడుతోంది.

Share post:

Latest