స‌మంత ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసే న్యూస్‌.. స్టార్ హీరోలు కూడా దిగ‌దుడుపే!

టాలీవుడ్ స్టార్ అండ్ మోస్ట్ టాలెంటెడ్‌ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల‌ `య‌శోద‌` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌దేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ ద‌ర్శ‌కులుగా వ్య‌వ‌హ‌రించారు.

నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా.. హిట్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి స‌మంత ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసి న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌ది రోజుల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 10వ రోజు వ‌సూళ్ల‌తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను బ‌ద్ద‌లు కొట్టి లాభాల బాట ప‌ట్టింది.

ఇక య‌శోద క్లీన్ హిట్ అవ్వ‌డ‌మే కాదు.. లాభాల వైపుగా అడుగు వేయ‌డంతో స‌మంత ముందు స్టార్ హీరోలు కూడా దిగ‌దుడుపే అంటూ ఆమె అభిమానులు తెగ మురిసిపోతున్నారు. కాగా, య‌శోద 10 డేస్ టోట‌ల్ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 4.04 కోట్లు
సీడెడ్: 80 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 1.12 కోట్లు
తూర్పు: 49 ల‌క్ష‌లు
పశ్చిమ: 30 ల‌క్ష‌లు
గుంటూరు: 51 ల‌క్ష‌లు
కృష్ణ: 56 ల‌క్ష‌లు
నెల్లూరు: 25 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ = 8.07 కోట్లు(14.25 కోట్లు~ గ్రాస్‌)
———————————-

తమిళం: 1.15 ల‌క్ష‌లు
క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 1.20 కోట్లు
ఓవ‌ర్సీస్: 2.65 కోట్లు
———————————-
టోటల్ వరల్డ్ వైడ్ – 13.07 కోట్లు(27.90 కోట్లు~ గ్రాస్)
———————————-

కాగా, రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. 10వ రోజు వ‌సూళ్ల‌తో టార్గెట్ ను రీచ్ అయింది. ప్ర‌స్తుతం ఈ సినిమా రూ. 1.07 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూప‌ర్ స్ట‌డీగా దూసుకుపోతోంది.