వ‌రుస డిజాస్టర్‌లు.. అయినాస‌రే ర‌వితేజ `ధమాకా`కు ఈ డిమాండ్‌ ఏంటి సామీ?

`క్రాక్` సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహారాజ్ రవితేజ.. మళ్లీ `ఖిలాడి`, `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాలతో వరుస ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన `ధమాకా` సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నాడు.

త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. `ధ‌మాకా` నాన్‌-థియేట్రికల్‌ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దాదాపు రూ.30 కోట్ల వరకు నాన్‌-థియేట్రికల్‌ బిజినెస్ జరిగిందట. ఇక డిజిటల్‌, శాటిలైట్‌ హక్కుల రూపంలో రూ.20 కోట్ల వ‌ర‌కు వ‌చ్చాయ‌ని టాక్ న‌డుస్తోంది. దీంతో వ‌రుస డిజాస్టర్‌లు ప‌డినాస‌రే `ధమాకా`కు ఈ డిమాండ్‌ ఏంటి సామీ అంటూ నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Share post:

Latest