రష్మీక:ఆ హీరో తో కలిసి రాలేదు.ఈ హీరో తోనైనా కలిసొస్తుందా..!!

తెలుగులో మొదట ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక. తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయినిగా పేరు సంపాదించుకుంది. ఇక తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరింత క్రేజీ అందుకుంది. దీంతో నేషనల్ క్రష్ గా కూడా పేరు పొందింది. ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది రష్మిక. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించేందుకు అక్కడ అడుగు పెట్టగా అక్కడ విడుదలైన గుడ్ బై చిత్రం రష్మికకు ఎదురు దెబ్బ తగిలింది.

Karthi & Rashmika Mandanna's Sulthan censored | Tamil Movie News - Times of  Indiaబాలీవుడ్ లో ప్రస్తుతం రష్మిక చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప సినిమా సీక్వెల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. ఇక మరొకసారి తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది రష్మిక. గత ఏడాది మొదటిసారి కార్తీతో కలిసి రష్మిక నటించిన యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం సుల్తాన్. ఈ చిత్రంతో మొదటిసారిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కానీ ఈ చిత్రం భారీ డిజాస్టర్ ని చవిచూసింది. దీంతో ఇప్పుడు మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి స్టార్ హీరో విజయ్ దళపతిని నమ్ముకుంది రష్మిక.

Rashmika Mandanna took the eyes of Thalapathy Vijay in the Muhurta Puja of  Thalapathy 66, the beauty was heavy on the Beast – PressWire18
తనతో కలిసి తమిళంలో వారీసు సినిమాలో నటిస్తున్నది. ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని వారసుడు అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. ఒకేసారి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్ భాషలలో సంక్రాంతి పండుగకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో నైనా రష్మిక కెరియర్ మార్చుకుంటుందేమో చూడాలి. ఇక తనకు ఇష్టమైన హీరోలలో విజయ దళపతి కూడా ఒకరిని పలు సందర్భాలలో తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest