రీ ఎంట్రీ ఇవ్వడంతో సుదీర్ ను చూసి కన్నీరు పెట్టుకున్న రష్మి..!!

జబర్దస్త్ బుల్లితెరపై ఎంతోమంది కమెడియన్లు కు మంచి విజయాలను అందుకోవడమే కాకుండా పలు సినిమాలలో హీరోలుగా కమెడియన్లుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై సుడిగాలి సుదీర్, రష్మీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం సుధీర్ ఈటీవీ నుండి మల్లెమాల నుండి దూరమై ఇతర చానల్స్ లో కనిపించారు. కానీ కొన్ని కారణాల చేత అక్కడ కూడా ఆ షో ని మూసివేయడంతో తిరిగి మళ్ళీ ఇప్పుడు మల్లెమాల నిర్వహిస్తున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీలో కనిపించడం జరిగింది. అందుకు సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతోంది.

Sudheer Rashmi : సుధీర్ తో ప్రేమ, పెళ్లిపై రష్మీ షాకింగ్ కామెంట్స్.. కెమిస్ట్రీ నిజమేనని - rashmi shocking comments about sudheer details here goes viral , Rashmi , sudheer ,rashmi shocking ...
అక్కడ రష్మీతో సుధీర్ కలిసి హోస్టుగా చేయడం మళ్ళీ ఆడియన్స్ కి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పవచ్చు ముఖ్యంగా సుదీర్ ఎనర్జిటిక్ కి యాంకర్ తో ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ మరింత క్రేజ్ తెచ్చుకోబోతోందని అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సుధీర్ ఎంట్రీ తోనే ఒక భారీ డైలాగుతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ రీ ఎంట్రీ ఇస్తానని చెప్పారు. కానీ ఎప్పుడు ఇస్తారు అనే విషయాన్ని మాత్రం తెలుపలేదు.

All in One Super Entertainer Promo | 8th November 2022 | Rashmi,Sudigali Sudheer, suma, Indraja - YouTube
చివరికి ఎట్టకేలకు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సుధీర్ రీ ఎంట్రీ తో అక్కడున్న వారంతా ఒకసారిగా ఆనందాన్ని వ్యక్తం చేశారు. మొదటి నుంచి చివరి వరకు ఈ ప్రోమో చాలా ఆసక్తిగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో భాను శ్రీ తన పాటలతో అందరిని కన్నీరు పెట్టించింది. ఇక ఈ ప్రోమోలో సుధీర్ కనిపించడంతో రష్మీ ఒక్కసారిగా ఏడవడంతో ఈ ప్రోమో చివరిగా ఎండ్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త వైరల్ గా మారుతోంది.

Share post:

Latest