టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . నాన్న మెగాస్టార్ పేరు చెప్పుకుని ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ టాప్ హీరోగా రాజ్యమేలుతున్నాడు . రీసెంట్ గానే ఆర్ ఆర్ ఆర్ సినిమా తో తన ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ వేసుకున్న ఈ చెర్రీ ..త్వరలోనే మరో బ్లాక్ బస్టర్ ను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో చరణ్ ఓ సినిమా లో నటిస్తున్నాడు. ఇంకా పేరు పెట్టిన ఈ సినిమాను ఆర్సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా షూట్ కంప్లీట్ చేస్తున్నారు .
రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం ఆర్ సి 15 చిత్ర యూనిట్ న్యూజిలాండ్ లో ఉంది . ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నట్లు మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది . వారం కిందటనే న్యూజిలాండ్ కు వెళ్లిన ఆర్సి15 టీం సర్వే గంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మేరకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్న ఆర్సి15 టీం..రీసెంట్గా స్నాక్స్ తింటూ గ్రూప్ ఫోటోను షేర్ చేశారు .
కాగా ఈ పిక్స్ లో రాంచరణ్ ఫుల్ లాగించేసిన్నట్లు తెలుస్తుంది . చేతిలో బర్గర్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తూ బాగా కుమ్మేస్తున్నాడు . అయితే దీనిపై ఉపాసన యాంగ్రీ గా ఉన్నట్లు తెలుస్తుంది . మనకు తెలిసిందే ఉపాసన హెల్త్ కేర్ ఎక్కువ . డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది . మొదటి నుంచి రాంచరణ్ డైట్ విషయాన్ని ఉపాసననే దగ్గరుండి చూసుకుంటుంది . ఇలాంటి క్రమంలోనే రాంచరణ్ జంక్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేసింది . షూటింగ్స్ కు వెళ్ళినా సరే ఇంటి ఫుడ్ ని పంపిస్తుంది . ఇలా అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ కు కచ్చితంగా కండిషన్స్ పెడుతుంది . అయితే ఆ కండిషన్స్ ని బ్రేక్ చేసిన చరణ్ ..ఫారిన్ లో జంక్ ఫుడ్స్ తింటూ ఉపాసనకు కోపం తెప్పిస్తున్నారు అంటూ కొన్ని న్యూస్ వైరల్ గా మారాయి. దీంతో ఫ్యాన్స్ చరణ్ పై స్వీట్ గా కోప్పడుతున్నారు. ఏది ఏమైనా సరే రామ్ చరణ్ న్యూ స్టైలిష్ లుక్ మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వెళ్ళింది.