మ‌హేష్‌కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిన పూజా హెగ్డే.. బిగ్ షాక్ త‌ప్ప‌దా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ప్ర‌ముఖ హీరోయిన్‌ పూజ హెగ్డే పెద్ద తలనొప్పిగా మారిందట. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మహేష్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్‌బీ28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ స్వరాలు అందిస్తున్నాడు.

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ ఇది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. దసరా అనంతరం రెండో షెడ్యూల్ ప్రారంభించాలని మేకర్స్‌ ప్లాన్ చేశారు. కానీ అంతలోనే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కనుమూయడంతో కొద్ది రోజులు సెకండ్ షెడ్యూల్ ను వాయిదా వేశారు. ఇక ఇప్పుడు మహేష్ షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పూజా హెగ్డే మాత్రం షూటింగ్‌కు సిద్ధం కాలేదు.

ssmb28 movie shooting update
ssmb28 movie shooting update

ఇటీవల ఆమె కాలికి బలమైన గాయమైంది. ప్రస్తుతం ఆమె ఆ గాయం నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక పూజ హెగ్డే కారణంగా మహేష్ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అవుతోంది. అసలే త్రివిక్రమ్ సినిమాను త్వర త్వరగా కంప్లీట్ చేసి రాజ‌మౌళి ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయాలని మ‌హేష్ భావిస్తున్నాడు.

కానీ ఇప్పుడు పూజా హెగ్డే వ‌ల్ల‌ సినిమా మ‌రింత ఆలస్యం అవుతోంది. ఈ విషయంలో మహేష్ తీవ్ర అసహనంతో ఉన్నాడ‌ట‌. ఈ నేపథ్యంలోనే పూజా హెగ్డే త్వరగా కోలుకోకుంటే ఆమెను తప్పించి మరో హీరోయిన్ ను ఖరారు చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే పూజా హెగ్డే బిగ్ షాక్ తప్పదని అంటున్నారు.

Share post:

Latest