పూజా హెగ్డే ఇంటిని ఎప్పుడైనా చూశారా..? ఇంద్ర‌భ‌వ‌న‌మే!

పూజా హెగ్డే.. ఈ పొడుగు కాళ్ళ సుందరి గురించి ప్రత్యేకమైన ప‌రిచ‌యాలు అవసరం లేదు. `ఒక లైలా కోసం` అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుకమ్మ.. కెరియర్ ఆరంభంలో వరస ఫ్లాపుల‌ను ఎదుర్కొన్నా.. ఆ తర్వాత బ్రేకుల్లేని హిట్లతో అనతి కాలంలోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు సౌత్ తో పాటు నార్త్ లోను బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా కడుపుతోంది. అలాగే పలు బ్రాండ్లకు ప్రచార కర్తగా వ్యవహరిస్తూ చేతి నిండా సంపాదిస్తుంది. అయితే తాజాగా ఈ బుట్ట బొమ్మ ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న తన ఇంటిని అందరికీ చూపించింది. ఏషియన్ పెయింట్స్ వేర్ ది హార్ట్ ఈజ్ సిరీస్ వీడియోలలో భాగంగా పూజా తన ఇంటిని ట్రైల‌ర్ రూపంలో అంద‌రినీ ప‌రిచ‌యం చేసింది.

అదిరిపోయే ఇంటీరియర్ డిజైన్ తో అందంగా అలంకరించిన తన డ్రీమ్ హౌస్ ను ఒక వీడియోలో వివ‌రిస్తూ అందరికీ చూపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. బుట్ట‌బొమ్మ ఇల్లు అదుర్స్ అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈ బ్యూటీ మ‌హేష్ బాబుకు జోడీగా `ఎస్ఎస్ఎమ్‌బీ 28` చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రాల్లో న‌టిస్తోంది.

Share post:

Latest