పవిత్ర లోకేష్ – నరేష్ కలిసే వున్నారా..?

ప్రముఖ సీనియర్ హీరో గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నరేష్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్నో కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా పలు రకాల క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటున్నారు. నరేష్ తన కెరియర్ పరంగా పాపులారిటీ దక్కించుకున్న విషయం పక్కన పెడితే.. వ్యక్తిగతంగా కూడా పలు రూమర్లకు చోటిస్తున్నాడని చెప్పాలి. ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని వైవాహిక జీవితానికి దూరంగా ఉన్నా తోడు కోసం పవిత్ర లోకేష్ తో తిరుగుతున్నాడు అనే వార్తలు బాగా వైరల్ అయ్యాయి.

pavitralokesh - Twitter Search / Twitterఅంతేకాదు ఈ వార్తలకు బలం ఇస్తూ అటు పవిత్ర లోకేష్ ఇటు నరేష్ ఇద్దరు కూడా చట్టపట్టాలేసుకొని మీడియా కంట పడడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేకాదు ఇద్దరూ కలిసి మహారాష్ట్రలోని ఒక దేవాలయంలో కలిసి పూజలు చేయించడంతో అందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు రావడం నిజంగా వీరిద్దరూ కలిసి ఉన్నారు. సహజీవనం చేస్తున్నారు అనే వార్తలకు మరింత ఆధారం దొరికింది.అయితే ఈ వార్తలపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నానా రభస చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు నరేష్ – పవిత్ర లోకేష్ బెంగళూరులోని ఒక హోటల్ గదిలో బయటకు రావడం రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పవిత్ర లోకేష్ ను చెప్పుతో కొట్టే ప్రయత్నం కూడా చేసింది రమ్యా రఘుపతి.

Naresh And Pavithra Lokesh Exclusive Visuals At Padmalaya Studios | Super  Star Krishna | NewsQube - YouTube

అయితే కొన్ని రోజుల తర్వాత సమస్య సద్దుమణిగింది నరేష్ – పవిత్ర లోకేష్ ను దూరం పెట్టేశాడు. ఇప్పుడు మరొక అమ్మాయితో కులుకుతున్నాడు అనే వార్తలు మరింత బలంగా వినిపించాయి. కానీ తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే వీళ్లిద్దరూ ఇంకా కలిసే ఉన్నారా? అని అనుమానం కలుగుతుంది. నిన్న కృష్ణ గారి పార్థివ దేహం వద్ద కూడా నరేష్ పక్కనే పవిత్ర లోకేష్ ఉండడం చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆమెను వదల లేకపోతున్నాడే అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.

Share post:

Latest