మన యువ హీరోలను వెంటాడుతున్న ఫెయిల్యూర్స్ భయం.. నితిన్ కూడా అందుకే భయపడుతున్నాడా..!!

తెలుగు యువ హీరోలలో చాలామంది పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా వెనకాలే మూడు ఫ్లాప్ లు అన్నట్టు వారి కెరియర్ కొనసాగుతుంది. టాలీవుడ్ హీరోలలో యువ‌ నితిన్ కూడా ఒకడు ఈయ‌న‌ కెరియర్ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే పడింది. వరుస అపజయాలు తర్వాత భీష్మ నితిన్ కి మంచి రిలీఫ్ ఇచ్చిన తర్వాత వచ్చిన సినిమాలు అతనికి ఘోరమైన డిజాస్టర్ సినిమాలు గా మిగిలిపోయాయి.

రీసెంట్ గా వచ్చిన మాచర్ల నియోజకవర్గం సినిమాతో మరో భారీ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకుని తన కెరీర్ ని ప్రమాదంలో పడేసుకున్నాడు. మరో ఇంకో ప్లాఫ్ వస్తే తట్టుకునే స్థితిలో నితిన్ లేడు. ఇన్ని సినిమాలో ప్లాఫ్ అవడంతో అతని కొత్త సినిమా విషయంలో కొంత భయపడుతున్నాడని తెలుస్తుంది. ఆల్రెడీ క‌మిట్ అయిన‌ సినిమాలు కూడా చేయటానికి జంకుతున్నాడు. ఇక ఈయన ఓన్ బ్యానర్లో చేయాల్సిన పవర్ పెట్ సినిమాను కూడా పక్కన పెట్టేసాడు.

మాచర్ల నియోజకవర్గం సెట్స్ మీద ఉండగానే రైటర్ కమ్‌ డైరెక్టర్ గా మారిన వక్కంతం వంశీ సినిమాకు ఓకే చెప్పాడు. స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తానని కూడా అతనికి మాటిచ్చాడు. మాచర్ల నియోజకవర్గం ప్లాప్‌ అయ్యేసరికి ఇప్పటికీ ఆ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ళటం లేదు. ముందు స్టోరీ చెప్పినప్పుడు ఈజీ గానే ఓకే చేశాడు కానీ.. ఎన్నో అంచనాలు పెట్టుకున‌ మాచర్ల డిజాస్టర్ అయ్యేసరికి తన కెరీర్ ప్రమాదంలో పడిందని నితిన్ లో భయం పట్టుకుంది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ అయ్యే వరకు సినిమా మొదలు పెట్టనని చెప్పాడట. నెలలు గడుస్తున్నా ఫుల్ స్క్రిప్ట్ కి ఒకే అవ్వట్లేదు. ఇక సినిమా కోసం నితిన్ గడ్డం పెంచుతూనే ఉన్నాడు.. సినిమా స్టోరీ మాత్రం ఓకే అవ్వట్లేదు. ఈ సినిమా ఫ్లాప్‌ అయితే తన కెరీర్ ప్రమాదంలో పడటమే కాదు తన సొంత నిర్మాణం సంస్థకు నష్టాలు తప్పవని నితిన్ భయపడుతున్నట్లు తెలుస్తుంది. అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడని సమాచారం

Share post:

Latest