తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించారు. ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలు అందుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించారు. ఇక సౌత్ లో అన్ని భాషలు చుట్టేస్తూ తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం అన్నిటిని ఒకేసారి మాట్లాడగలడు ఎన్టీఆర్. ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ జపనీస్, చైనీస్ బాషల్ని సైతం మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ భాషలన్నీ మాట్లాడగలిగిన వ్యక్తి మా హీరో అంటూ అభిమానులు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటున్నారు.
కేవలం ట్రైనింగ్ తీసుకొని ఆరు నెలలోనే ప్రపంచంలో ఏ భాష అయినా ఇట్టే మాట్లాడేస్తారని ఎన్టీఆర్ సన్నిహితులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ లో నేర్చుకోవాలన్న కసి పట్టుదల ఏకాగ్రత తనని ఈ స్థాయికి తీసుకువచ్చాయని ఎన్టీఆర్ సన్నిహితులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. ఇన్ని భాషలు మాట్లాడగలిగిన ఏకైక తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. సామాన్యంగా అయితే కేవలం హిందీ, ఇంగ్లీష్ భాష వస్తే చాలు ప్రపంచంలో ఎక్కడైనా సరే మాట్లాడవచ్చు అనే భావనతో ఉన్నారు అందరూ.
అయితే సౌత్ లో మాత్రం ఎన్టీఆర్ తప్ప ఇలా అన్ని భాషలు మాట్లాడగలిగే హీరో ఇప్పటివరకు ఎక్కడ కనిపించలేదని చెప్పవచ్చు. కానీ కమలహాసన్ మాత్రం వివిధ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు.ఆయన విదేశీ భాషలు ఎక్కువగా మాట్లాడారు. తెలుగు ఎంతో చక్కగా అర్థం చేసుకుంటారు అంతే చక్కగా మాట్లాడగలరు కూడా. ఇక ఎన్టీఆర్ మాత్రం 9 భాషలలో మాట్లాడగలిగి ఏకైక హీరో అని చెప్పవచ్చు. దీంతో నందమూరి అభిమానులు చాలా ఆనందాన్ని తెలియజేస్తున్నారు.