అప్పుడు సమంత-చైతన్య..ఇప్పుడు జెనీలియా-రితీష్..కన్నీరు పెట్టుకుంటున్న ఫ్యాన్స్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత, హీరో నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ మధ్యనే విడాకులు తీసుకొని దూరంగా బ్రతుకుతున్నారు. వీళ్లు కలిసి ఉన్నప్పుడు ఇష్టంగా చేసిన సినిమా మజిలీ . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఈ సినిమాలో సమంత నాగచైతన్య పర్ఫామెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి . మరీ ముఖ్యంగా సమంత నాగచైతన్యను ఎంతగా ప్రేమిస్తుందో ఈ సినిమా చూసిన జనాలకు ఇట్టే అర్థం అయిపోతుంది.

కాగా ఇదే సినిమాను ఇప్పుడు మరాఠీలో రీమేక్ చేస్తున్నారు బాలీవుడ్ హీరో రితీష్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న జెనీలియా భర్తే ఈ రితేష్. కాగా ఫస్ట్ టైం తనలోని డైరెక్షన్ టచ్ ను జనాలకు పరిచయం చేయబోతున్నాడు . ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా మనకు ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడు రితేష్. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా జెనీలియా నటిస్తుంది . ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది . మజిలీ సినిమాను మరాఠీలో వేడ్ అనే పేరుతో రిలీజ్ చేయబోతున్నారు .

అంతేకాదు సేమ్ సమంత నాగచైతన్య మధ్య ఎలాంటి సీన్స్ వచ్చాయో ..ఈ సినిమాలో కూడా రితిష్ – జెనీలియా మధ్య అలాంటి సీన్స్ వచ్చాయో.. ఈ సినిమాలో కూడా అలా వచ్చేలా ప్లాన్ చేశాడని .. ఈ సినిమా చూసిన తర్వాత జెనీలియా పెర్ఫార్మన్స్ కు సమంతను మర్చిపోవడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. వేడ్ అంటే పిచ్చి ప్రేమ అని అర్థం ..రితీష్ అంటే జెనీలియాకు ఎంత పిచ్చి ప్రేమో ఈ సినిమా ద్వారా తెలియజేసేలా డైరెక్ట్ చేశారట రితీష్. కాగా ఈ సినిమా డిసెంబర్ 30న గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్ధపడ్డారు మేకర్స్ . ఇదే క్రమంలో ఈ సినిమా తీసిన తర్వాత నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని విడిపోయారు ..దీంతో అదే సెంటిమెంట్ వర్కౌట్ అయితే పరిస్థితి ఏంటి అంటూ ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు..!!

 

Share post:

Latest