ఆ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్ గా NTR.. డీల్ తెలిస్తే కళ్ళుతిరిగి పడిపోతారు!

నందమూరి చిచ్చరపిడుగు Jr NTR గురించి పరిచయం ఇవ్వాల్సిన పనిలేదు. ఇపుడున్న తెలుగు నటులలో చెప్పుకోదగ్గ నటుడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తూ వున్న ఎన్టీఆర్ – కొరటాల చిత్రం త్వరలో సెట్స్ మీదకి వెళ్లబోతుందని టాక్ వినబడుతోంది. దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటించబోయేది చిత్రం కావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారట.

ఈలోగా ఎన్టీఆర్ యాడ్ షూట్స్ తో బిజీగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తాజాగా తారక్ ఒక కొత్త ఎండార్స్మెంట్ కి సైన్ చేసినట్లు వార్తలు బయటకు పొక్కాయి. ఆ యాడ్ కి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నట్లు, షూటింగ్ కూడా సినిమా స్థాయిలో జరుగుతుందని టాక్ వినబడుతోంది. త్వరలోనే ఈ యాడ్ కి సంబంధించిన వివరాలని అధికారికంగా ప్రకటించనున్నారు. TV, డిజిటల్ యాడ్ కోసం ఈ షూటింగ్ చేస్తున్నారట. ఓ ప్రముఖ కంపెనీ ప్రోడక్ట్ కోసం తారక్ ఈ యాడ్ కి సైన్ చేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయానికొస్తే, ఈ డీల్ ద్వారా తారక్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాలీవుడ్లో రూమర్లు గుప్పుమంటున్నాయి. ఇక ఇప్పటికే తారక్ పలు సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా, తాజాగా ఈ యాడ్ సదరు లిస్టులో చేరనుంది. ఇక సినిమా విషయానికి వస్తే కొరటాల చిత్రంలో ఎన్టీఆర్ అనేక రకాల గెటప్స్ లో కనిపించనున్నాడని టాక్. అచ్చం చియాన్ విక్రమ్ టైపు సినిమా అని అంతా అనుకుంటున్నారు. అలాగే ఈ సినిమాలో కళ్ళు చెదిరే యాక్షన్ సీక్వెన్స్ కొరటాల శివ డిజైన్ చేస్తున్నట్టు వినికిడి. కొరటాల చిత్రం తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించనున్నాడు.

Share post:

Latest