త్రిష‌కు ఎంత పొగ‌రు.. ఒక్క పోస్ట్‌తో అడ్డంగా బుక్కైన బ్యూటీ!

ప్రముఖ హీరోయిన్ త్రిషపై నెటిజ‌న్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎంత పొగరు అంటూ ఆమెను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రభాస్, త్రిష జంటగా నటించిన చిత్రం `వర్షం`. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్ ఎస్‌ రాజు నిర్మించారు. 2004 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ప్రభాస్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్షం సినిమాను తాజాగా రీ రిలీజ్ చేశారు.

చాలా చోట్ల ఈ సినిమాను మళ్ళీ విడుదల చేయ‌గా.. కొన్ని సెంటర్స్ లో మాత్రమే హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. అయితే వర్షం సందర్భంగా థియేటర్స్ లో అభిమానులు సందడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను త్రిష తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ `18 ఏళ్ల తర్వాత కూడా వర్షం సినిమాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీ కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను` అంటూ అభిమానులను కొనియాడింది.

varsham re release
varsham re release

అయితే వాస్త‌వానికి వర్షం సినిమాను రీ రిలీజ్ ప్లాన్ చేసింది, థియేటర్లలో సందడి చేస్తున్నది ప్రభాస్ అభిమానులు. కానీ, త్రిష మాత్రం తన అభిమానులా ఫీలై పోస్ట్ పెట్టింది. ఆ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. త‌న పోస్ట్‌లో ప్రభాస్ గురించిగానీ, చిత్ర బృందం గురించి గానీ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఈ నేపథ్యంలోనే త్రిషను ఏకేస్తున్నారు. నీకు అంత పొగరు అవసరమా అంటూ ఆమె పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి త్రిష‌ ఒక్క పోస్టుతో అడ్డంగా బుక్ అయింది.

Share post:

Latest