ముమ్మిడివరంపై సుబ్బరాజు పట్టు..సతీష్‌కు షాక్..?

కోనసీమలో ప్రశాంతమైన వాతావరణం ఉండే నియోజకవర్గాల్లో  ముమ్మిడివరం ఒకటి. జి‌ఎంసి బాలయోగి లాంటి నాయకులు గెలిచిన నియోజకవర్గంగా ఉన్న ముమ్మిడివరంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. పరిస్తితులు బట్టి అక్కడి ప్రజలు తమకు కావల్సిన వారిని ఎంచుకుంటారు. అయితే ముమ్మిడివరంలో ఎక్కువసార్లు టీడీపీనే ఆదరించారు. 1983, 1985, 1996 బై పోల్,1999, 2014 ఎన్నికల్లో టీడీపీనే గెలిచింది. మధ్యలో 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. అంటే రెండు పార్టీలని సమంగానే ఆదరించారు.

కాకపోతే ఎక్కువ శాతం రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ఊపు బట్టే ఇక్కడ గెలుపోటములు ఉంటాయు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలవగా, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ తరుపున పొన్నాడ సతీశ్ కుమార్ విజయం సాధించారు. కేవలం 5547 ఓట్ల తేడాతో పొన్నాడ గెలిచారు. అయితే ఎమ్మెల్యే పొన్నాడ అనుకున్న రీతిలో ఆకట్టుకోలేకపోయారు.

ఏదో సంక్షేమ పథకాల వరకు ఎమ్మెల్యేకు ప్లస్ తప్ప..అభివృద్ధి తక్కువ. అలాగే కోనసీమ అల్లర్లలో మంత్రి విశ్వరూప్‌తో పాటు ఎమ్మెల్యే పొన్నాడ ఇల్లుపై కూడా దాడులు జరిగిన విషయం తెలిసిందే. కోనసీమ జిల్లా పేరు విషయంలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అటు ఇసుక, ఇళ్ల స్థలాల్లో ముమ్మిడివరంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇవి ఎమ్మెల్యేకు మైనస్ అవుతున్నాయి.

అటు టీడీపీ నేత దాట్ల సుబ్బరాజు ఈ మూడున్నర ఏళ్లలో ప్రజల్లో బాగానే తిరిగారు..ప్రజా సమస్యలపై పోరాటాలు చేశారు. వరదల సమయంలో బాధితులకు అండగా నిలబడ్డారు. సొంత డబ్బులని సైతం గట్టిగానే ఖర్చు పెడుతూ, ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇలా ప్రజల మనిషిగా సుబ్బరాజు ముందుకెళుతున్నారు. ఇదే సుబ్బరాజుకు అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడున్న పరిస్తితుల్లో సుబ్బరాజు పైచేయి సాధించినట్లు కనిపిస్తున్నారు. కాకపోతే జనసేనకు ఇక్కడ ఓటు బ్యాంక్ ఎక్కువ గత ఎన్నికల్లోనే 33 వేల ఓట్లు పడ్డాయి..ఈ సారి కూడా సింగిల్ గా పోటీ చేస్తే ఓట్లు చీలి టీడీపీకే నష్టం. కానీ కలిసి పోటీ చేస్తే డౌట్ లేకుండా వైసీపీ ఓటమి ఖాయం.