అఖిల్ కు జంటగా మెగా డాటర్ నిహారిక.. ఆ సినిమా ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు..!

మెగా డాటర్ నిహారిక కొణిదల సినిమాల్లోకి రావడానికి ముందే ఓ షార్ట్ ఫిలింలో నటించారని తెలుస్తుంది. అది కూడా ఆ షార్ట్ ఫిలింలో హీరోగా అక్కినేని యువ హీరో అఖిల్ తో నటించిందట. ఈ షార్ట్ ఫిలిం కు డైరెక్టర్ గా రాజమౌళి కుమారుడు కార్తికేయ తెరకెక్కించాడు. కానీ ఈ షార్ట్ ఫిలింను బయటకు రానివ్వలేదు. దీన్ని ఎందుకు బయటకు రానివ్వలేదంటే అదో పెద్ద కళాఖండమట. ఈ విషయాన్ని నిహారిక స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ షార్ట్ ఫిలింలో నటించిన తర్వాత నుంచి ఈమె స్నేహితుడు కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ.. నిహారికను ఆశ అంటూ ఆట పట్టించే వారట.

Niharika Konidela: Niharika acted in a short film opposite Akhil.. It is a masterpiece! » Jsnewstimes

ఆహాలో మంచు లక్ష్మి వ్యాఖ్యాత‌గా చేస్తున్న చెఫ్ మంత్రా సీజన్ 2 లో నిహారిక- కాలభైరవ గెస్ట్ లుగా వచ్చారు. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.. అందుకే ఈ షో లో వీళ్ళకి ఒకరి గురించి ఏం తెలుసు తెలుసుకోవడానికి మంచు లక్ష్మి చాల‌ ప్రయత్నించారు.. ఈ క్రమంలోనే చాలా విషయాలు బయటకు వచ్చాయి. నిహారికను వాళ్ళ ఫ్రెండ్స్ ముద్దుగా నిహా అనిలుస్తారట. మంచు లక్ష్మి కాలభైరవని మీరు నిహారికని ఏమని పిలుస్తారు అని అడగ్గా.. నేను నిహారికని ఆశ అని పిలుస్తానని చెప్పాడు. ఇక అప్పుడు నవ్వుతూ కాలభైరవకు దండం పెడుతూ ఎందుకు పిలుస్తావో చెప్పొద్దంటూ అతన్ని బతిమిలాడుకుంది.. అయినప్పటికీ కాలభైరవ ఆ సీక్రెట్ ను బయటికి చెప్పేసాడు.

Niharika and Akhil to come together in their next?

నిహారిక షార్ట్ ఫిలింలో నటించిందని చెప్పగానే .. అది పెద్ద ‘కళాఖండం అంటారంటూ నిహారిక అంది. ఈ షార్ట్ ఫిలిం గురించి ఎవరికీ తెలియదు. మా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. ఆ షార్ట్ ఫిలింలో నిహారిక నటించిన పాత్ర పేరు ఆశ. ఆ షార్ట్ ఫిలిం గురించి మా ఇద్దరికీ మాత్రమే తెలుసు. కాబట్టి నేను నిహారికని ఆశ అని పిలుస్తానని కాలభైరవ చెప్పాడు. అప్పుడు మంచు లక్ష్మి ఆ షార్ట్ ఫిలిం అంత బాగుంటుందా అందుకనే బయటికి రానివ్వలేదా అని అడగగా.. ఈ విషయాన్ని కార్తికేయని- అఖిల్ ని అడగండి అని కాలభైరవ- నిహారిక అన్నారు. ఇక మీ షార్ట్ ఫిలిం నాకు ఇవ్వండి నేను రిలీజ్ చేస్తాను ఎంత డబ్బులు వచ్చినా మీకే ఇస్తానని మంచు లక్ష్మి అనగా.. డబ్బులు గురించి చూసుకుంటే ఆ షార్ట్ ఫిలిం బయటకు వస్తే మా పరువు పోతుందని బదులిచ్చింది. ప్రస్తుతం నిహారిక- కాలభైరవ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share post:

Latest