చిరంజీవి ఏ సినిమాలో నటించిన ఆ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ సినిమా బిజినెస్ పరంగా కూడా బాగానే జరుగుతోంది అనే విషయం ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉంటుంది. కెరియర్ విషయంలో ఇబ్బందులు ఎదురైన ప్రతి సందర్భంలో చిరంజీవి సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపోయారు. ఎన్నో సంవత్సరాలపాటు రెమ్యూనరేషన్ విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న చిరంజీవి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సీనియర్ హీరోలలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరో చిరంజీవి అనే సంగతి అందరికీ తెలిసినదే..
తాజాగా ప్రముఖ డైరెక్టర్, నటుడు, వల్లభనేని జనార్ధన్ ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి మాట్లాడుతూ చిరంజీవి నటించిన ఒక సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. నాకు నచ్చిన కథలను నేను డైరెక్ట్ చేశానని తెలిపారు ఆడియన్స్ పల్స్ ను నేను పట్టుకోలేదని తెలిపారు.నా సినిమాల ఫ్లాప్ ఫలితాలకు కారణాలు ఏవైనా ఉండవచ్చని కామెంట్స్ చేశారు. మగ మహారాజు సినిమాకు డైరెక్షన్ చేసే అవకాశం వచ్చినట్టే వచ్చి పోయిందని తెలిపారు డైరెక్టర్ వల్లపనేని జనార్ధన్. శ్రీనువైట్ల నీకోసం సినిమా మధ్యలో ఆగిపోయిందని ఆయన తీసిన రష్ నచ్చి ఒరిజినల్ లో నిర్మాత తో మాట్లాడి హక్కులను తీసుకోవడం జరిగిందని వల్లభనేని జనార్ధన్ తెలిపారు.
ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ ఎక్కువ ప్రేమనరేషన్ అడగడానికి మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చవలసి వచ్చిందని తెలిపారు జనార్ధన్. దేవిశ్రీ ప్రసాద్ తనని అంకుల్ అని పిలుస్తూ ఉంటారని తెలిపారు. హ్యాపీ పట్నాయక్ వేరే సినిమా కోసం రికార్డు చేసిన పాటలను తమ సినిమా కోసం ఉపయోగించడం జరిగిందని తెలిపారు. ఇక ఆ సినిమాకు నాలుగు నంది అవార్డులు కూడా వచ్చాయా వల్లభనేని తెలిపారు.