మహేశన్నా.. నీకే ఎందుకు ఇంత దుఃఖం..!

సినిమాలలో హీరోలు విలన్లని కొడుతుంటే ప్రేక్షకులు సైతం విజిల్స్ వేస్తూ ఉంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి సాధారణ మనసులే అని గుర్తించేది ఎప్పుడంటే ఆ స్టార్ల వ్యక్తిగత జీవితాలలో పలు విషాదాలు వచ్చినప్పుడనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఎలాంటి వివాదాలలోకి తల దూర్చకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ పోయే మహేష్ బాబు లాంటి వాళ్లకు జరిగినప్పుడు అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా చాలా విలవిలలాడిపోతారు. ఫ్యాన్స్ ప్రేమగా సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉండే మహేష్ పరిస్థితి చూస్తే ఇప్పుడు నిజంగా అలాగే ఉందని చెప్పవచ్చు.

Superstar Krishna's Family Celebrates Their Anniversary Along With Sudheer  Babu's Son Charith's Birthdayకరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఏడాది మహేష్ బాబుకు మాత్రం తీరని చేదు జ్ఞాపకాలను మిగిల్చాయని చెప్పవచ్చు. జనవరిలో తన ప్రాణంగా ఇష్టపడే అన్నయ్య రమేష్ బాబు దూరం అవ్వడమే కాకుండా చివరి చూపు భాగ్యం కూడా దక్కలేదు. మహేష్ బాబు ఈ స్థాయిలో రావడానికి గల కారణం తన సోదరుడు అని ఎన్నోసార్లు చెప్పకనే తెలియజేశారు. ఇక తర్వాత ఎంతో ప్రేమగా చూసుకునే మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కూడా గత కొన్ని నెలల క్రితమే మరణించింది. ఇవన్నీ తట్టుకొని నిలబడిన తను నటుడుగా.. సూపర్ స్టార్ స్టేటస్ కి పునాది వేసిన తన తండ్రి కృష్ణ మరణ వార్తతో మరింత దిగ్బ్రాంతికి గురయ్యారు మహేష్ బాబు.

Mahesh Babu's sibling Ramesh Babu dies of liver-related complicationఇక మహేష్ బాబు అభిమానులు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా విని ఎంతోమంది ఆనందపడ్డారు కానీ ఈ ఆనందం కన్నా మహేష్ బాబు కుటుంబ సభ్యులకు ఇలా జరగడం వల్ల ఎక్కువ బాధేస్తుందని అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ బాధలన్నీ విని అభిమానులు మహేశన్నా.. నీకే ఎందుకు ఇంత దుఃఖం అంటూ తెగ బాధ పడిపోతున్నారు ఏదేమైనా మహేష్ బాబు జీవితంలో ఇంతటి విషాద ఛాయలు బహుశా ఎప్పుడు అలుముకోలేదేమో.

Share post:

Latest