తండ్రి మీద ప్రేమతో కీలక నిర్ణయం తీసుకున్న మహేష్ బాబు..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అలుపెరగని బాటసారిగా తన వంతు ప్రయత్నం చేసి తెలుగు సినిమా ఖ్యాతినే ఎల్లలు దాటించిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఎన్నో సినిమాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడమే కాకుండా 70 ఎంఎం థియేటర్ , ఈస్ట్ మన్ కలర్ తో పాటు కౌబాయ్, జేమ్స్ బాండ్ తరహా చిత్రాలను కూడా పరిచయం చేసింది ఈయనే కావడం గమనార్హం. సుమారుగా 350 చిత్రాలకు పైగా హీరోగా నటించిన కృష్ణ అందులో 16 సినిమాలకు దర్శకత్వం వహించారు. అలాగే నిర్మాతగా పద్మాలయ స్టూడియో ఏర్పాటు చేసి ఆ స్టూడియో పై ఏకంగా 46 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

Ghattmanenis in plans for a Krishna Memorialఇంత ఘనత సాధించి ఇండస్ట్రీ కి దూరంగా ఉన్న కృష్ణ గారు అభిమానులను మాత్రం కోల్పోలేదనే చెప్పాలి అయితే ఇటీవల ఆయన హార్ట్ ఎటాక్ రావడంతో హైదరాబాదులోని కాంటినెంటల్ హాస్పత్రిలో ఆదివారం చేరగా మంగళవారం ఉదయం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మరణించారు. ప్రధాన అవయవాలు పనిచేయకపోవడం వల్ల శరీరం చికిత్సకు సహకరించలేదు. అందుకే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక కృష్ణ మరణం సినీ ఇండస్ట్రీకి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు , అభిమానులు , కుటుంబ సభ్యుల మధ్య తెలంగాణ ప్రభుత్వాలు అంచనాలతో కృష్ణ గారికి నిన్న జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది.

mahesh babu, Krishna Memorial: Krishna Memorial in Hyderabad.. Mahesh  Babu's decision! – mahesh babu likely to build superstar krishna memorial  in hyderabadకాగా తండ్రి మీద ప్రేమతో మహేష్ బాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాదులో కృష్ణకు గుర్తుగా ఒక మెమోరియల్ ను ఏర్పాటు చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు మహేష్ బాబు. ఇందులో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలను, షీల్డ్ లను ఉంచనున్నారు. అయితే పద్మాలయ స్టూడియో పక్కనే దీనిని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా మహేష్ బాబు ప్రకటన చేయనున్నారు.

Share post:

Latest