టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హ్యాండ్సమ్ హీరో ..లవబుల్ మెంటాలిటీ.. ఈ హీరో గురించి ఎన్ని చెప్పినా తక్కువే . కాంట్రవర్షియల్ జోలికి అస్సలు వెల్లడు. తన పని తాను చూసుకుంటూ తన జోలికి వస్తే వదలకుండా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే హీరో ఈ మహేష్ బాబు . కాగా ఇప్పటికే చాలాసార్లు మహేష్ బాబు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ జూన్మలో అలా జరిగే ప్రసక్తే లేదంటూ ఇప్పటికే ఆయన క్లారిటీ ఇచ్చాడు.
అంతేకాదు పాలిటిక్స్ అంటే పెద్దగా నచ్చని మహేష్ బాబుకు స్టార్ పొలిటిషియన్ అంటే మాత్రం చాలా ఇష్టమట . అంతా ఇంతా కాదు అమ్మ తర్వాత అమ్మ అంతగా ఇష్టమట . ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చిన మహేష్ బాబుకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ వైరల్ గా దూసుకుపోతుంది . మనకు తెలిసిందే లేడి సూపర్ స్టార్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సూపర్ స్టార్ కృష్ణతో జతకట్టి మంచి హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నింది. అంతేకాదు లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరుగా విజయశాంతి తన పేరు నమోదు చేసుకున్నింది.
విజయశాంతి – మహేష్ బాబు కాంబోలో కొడుకు దిద్దిన కాపురం సినిమా సూపర్ హిట్గా నిలిచింది . ఈ సినిమా చూస్తున్న టైం లో మహేష్ బాబుకి విజయశాంతి అంటే చాలా ఇష్టం ఏర్పడిందట. అంతేకాదు ఆమె మైండ్ సెట్ ,బిహేవియర్, మాట్లాడే పద్ధతి అన్ని కరెక్ట్ గా ఉంటాయని చిన్నతనంలోనే మహేష్ బాబు ఆమెకు బిగ్ ఫ్యాన్ గా మారిపోయాడట. అంతేకాదు సినిమా షూటింగ్ టైంలోనూ షాట్ అయిపోగానే ఆమె వెనకే తిరిగేవాడట . అంతలా ఇష్టమట విజయశాంతి అంటే . అంతే కాదు పెద్దయ్యాక మహేష్ బాబు ఆమెతో నటించాలని చాలా ట్రై చేశారట. ఆ కోరిక సరిలేరు నీకెవ్వరు అనే సినిమాతో నెరవేరినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు కచ్చితంగా ఆమెతో మరో సినిమా చేస్తానని సినిమా సక్సెస్ సందర్భంగా మహేష్ బాబు చెప్పకు వచ్చారు . దీంతో మహేష్ బాబుకి విజయశాంతి అంటే అంత ఇష్టమా అంటూ ఆశ్చర్యపోతున్నారు.