ఈ స్టార్ హీరోయిన్స్‌ సినిమాలకు బ్రేక్ చెప్పినట్టేనా? రీ ఎంట్రీ ఎప్పుడు?

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల క్రేజ్ కి కాస్త కాలపరిమితి అనేది ఉంటుంది. ఇక్కడ బాలీవుడ్లో లాగా హీరోలకు మల్లే హీరోయిన్లు కంటిన్యూస్ గా క్రేజ్ ని మెంటైన్ చేయలేరు. ఓ నాలుగు ఐదేళ్ల లోపే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇలాంటి తరుణంలో కూడా కొంతమంది హీరోయిన్లు మాత్రం దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు రాణిస్తున్నారు అంటే అది చెప్పుకోదగ్గ విషయం. ఆలా వరుస హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటూ క్రేజ్ ను పెంచుకున్న ముద్దుగుమ్మలు ఇక్కడ చాలా మందే వున్నారు.

అయితే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ముగ్గురు కొంతకాలంగా బ్రేక్‌లోనే ఉన్నారు. ఆ ముద్దుమ్మలు ఎవరంటే.. రీసెంట్‌గా తన హెల్త్ ఇష్యూ గురించి రివీల్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చిన సమంత ఒకరు. ఈమె ప్రస్తుతం సదరు హెల్త్ ఇష్యూ వలన ట్రీట్మెంట్‌ తీసుకుంటున్నారు. ప్రజెంట్‌ ఆమె లాంగ్ బ్రేక్‌ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇక ఆ తరువాత మరో స్టార్ హీరోయిన్‌ పూజా హెగ్డే. ఈమె కూడా ప్రజెంట్ రెస్ట్‌లోనే ఉన్నారు. కాలు ఫ్యాక్చర్ కావటంతో చాలా రోజులుగా ఇంటికే పరిమితమైన బుట్టబొమ్మ.. ఈ మధ్యే ఓ యాడ్ షూట్‌లో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో షూటింగ్‌ చేసేందుకు ఈమె ఎప్పుడు సై అంటుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రావలసి వుంది.

అలాగే రీసెంట్‌గా బాలీవుడ్ మూవీ గుడ్‌బై తో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన రష్మిక కూడా టాలీవుడ్ సినిమాలను ఏమి కమిట్ కాలేదు. సోషల్ మీడియాలో తన మీద వస్తున్న నెగెటివిటీ తో విసిగిపోయిన రష్మిక కాస్త గ్యాప్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. పుష్ప 2 షెడ్యూల్‌ కు ఇంకా టైమ్ ఉండటంతో ఈ గ్యాప్‌ను పర్సనల్‌ యాక్టివిటీస్‌ కోసం కేటాయించారని తెలుస్తోంది. ఇలా ఒకేసారి ముగ్గురు స్టార్ హీరోయిన్లు బ్రేక్ తీసుకోవటంతో మరలా వారు ఎప్పుడు తెలుగు తెరపై దర్శనం ఇస్తారో తెలియకుండా ఉందని కొంతమంది నిర్మాతలు వాపోతున్నారని వినికిడి.

Share post:

Latest