మేక‌ప్ లేకుండా కీర్తి సురేష్ పోజులు.. వామ్మో ఇలా ఉందేంటి?

కీర్తి సురేష్.. ఈ అందాల బామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళం కు చెందిన ఈ ముద్దుగుమ్మ `మహానటి` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే జాతీయస్థాయిలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ కొన్నాళ్లు వరస ప్లాపులతో సతమతం అయినప్పటికీ.. ఇటీవల విడుదలైన `సర్కారు వారి పాట`తో హిట్టు కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్‌ ఎక్కింది.

ప్రస్తుతం ఈ బ్యూటీ న్యాచురల్ స్టార్ నానికి జోడిగా `దసరా` అనే సినిమాలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా `భోళా శంకర్‌` చిత్రంలో నటించబోతోంది.

మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. వీటితో పాటు మలయాళ, తమిళ భాషల్లోనూ కీర్తి సురేష్ పలు ప్రాజెక్టులను టేకప్ చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా మేకప్ లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చింది.

అంతేకాదు ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరితోనూ పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కొంద‌రు మేకప్ లేకపోయినా కీర్తి సురేష్ ఎంతో అందంగా ఉందంటూ కామెంట్ చేస్తుంటే.. కొందరు మాత్రం వామ్మో మేకప్ లేకపోతే కీర్తి సురేష్ ఇలా ఉంది ఏంటి అంటూ సెటైర్లు వేస్తున్నారు. నిజం చెప్పాలంటే మేకప్ లేకున్నా కీర్తి సురేష్ ఎంతో అందంగా మెరిసిపోతూ కనిపిస్తోంది.

Share post:

Latest