సింగిల్ పోస్ట్‌కి రూ.కోటి రెమ్యునరేషన్.. కత్రిన క్రేజ్ మామూలుగా ఉండదు మరి!

ఇండియాలో హైయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. కత్రినా మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి ‘బూమ్’ అనే సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2004లో మల్లీశ్వరి సినిమాలో మీర్జాపూర్ ప్రిన్సెస్ గా కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2005లో కత్రిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మైనే ప్యార్ క్యూన్ కియా’లో చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతోనే తన కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోలేదు.

ఈ సినిమా తరువాత ‘నమస్తే లండన్’,’వెల్‌కమ్’, ‘పార్ట్‌నర్’, ‘న్యూయార్క్’ లాంటి సినిమాల్లో నటించి ఫుల్ ఫేమస్ అయింది. సినిమాల్లో చేస్తూనే అదిరిపోయే ఐటమ్ సాంగ్స్‌లో నటించిన ఈ ముద్దుగుమ్మ యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటు సినిమాల్లో సంపాదిస్తూ అటు యాడ్స్ మిగతా సోర్సెస్ నుంచి కూడా ఈ భామ డబ్బులు సంపాదిస్తుంది. 2019లో కాస్మెటిక్ బ్రాండ్‌ ‘కే బ్యూటీ’ని ప్రారంభించి బాగా లాభాలు దక్కించుకుంది. ఈ అమ్మడుకి సినిమాలోనే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపు 65 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న కత్రినా బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల రూపంలో చాలా డబ్బులు పొందుతుంది.

అసలు కత్రిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు ఎంత సంపాదిస్తుందో ఎవరూ ఊహించలేరు కూడా. బాలీవుడ్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ ముద్దుగుమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో ప్రమోషనల్ పోస్ట్‌కు దాదాపు రూ.97 లక్షల వరకు వసూలు చేస్తుంది. అంటే ఇంచుమించు కోటి రూపాయలు. ఈ రోజుల్లో ఒక పూర్తి సినిమా చేసిన లేడీ యాక్టర్ లకు ఈ రేంజ్ లో డబ్బులు రావడం లేదు. కానీ ఈ ముద్దుగుమ్మ జస్ట్ ఒక నిమిషంలోనే కోట్లు సంపాదిస్తూ తనకున్న క్రేజ్‌ ఎంతో చెప్పకనే చెబుతోంది. ప్రస్తుతం ఈ ‘అల్లరి పిడుగు’ భామ స్లైస్, నక్షత్ర, పానాసోనిక్, లాక్మే, లోరియల్, రీబాక్ ఇండియా, ఇమామి, లినో పెరోస్ లాంటి టాప్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తోంది.

Share post:

Latest