ప్రియుడు విక్కీ కౌశల్ కు పెళ్ళికి ముందే కండీషన్లు పెట్టిన కత్రీనా కైఫ్?

అదేంటి బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కి బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కి పెళ్లి ఎప్పుడో అయిపోతే ఇప్పుడు కండిషన్స్ ఏమిటని ఆశ్చర్యపోకండి. ప్రియుడు విక్కీ కౌశల్ కు పెళ్ళికి ముందే కత్రీనా కైఫ్ కండీషన్లు పెట్టి మరీ వివాహం ఆడిందని బాలీవుడ్ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. తనకంటే చిన్నవాడిని పెళ్ళి చేసుకున్న కత్రీనా విక్కీ విషయంలో చాలా పార్టిక్యూలర్ గా వుంటున్నాడని వినికిడి. వీరి ప్రేమ.. పెళ్ళి బాలీవుడ్ లో అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. కాగా ప్రస్తుతం వీరు ఇద్దరు మ్యారీడ్ లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

తెలుగులో మల్లీశ్వరి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామను తెలుగు ప్రేక్షకులు కూడా అంత త్వరగా మర్చిపోరు. కాగా ఆ తరువాత బాలీవుడ్ చెక్కేసిన ఈ అమ్మడు దాదాపు రెండు దశాబ్దాలపాటు బాలీవుడ్ ను ఏలింది. ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గానే అక్కడ కొనసాగుతోంది. కాగా ప్రస్తుతం కత్రీనాకు సబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. విక్కీ కౌశల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా కైఫ్.. వీళ్ల డేటింగ్ టైంలోనే విక్కీ కౌశల్ కు కొన్ని కండిషన్స్ పెట్టిందట. మరీ ముఖ్యంగా పెళ్లి చేసుకోవడానికి ఆమె పెట్టిన కండిషన్స్ వింటే మీరు నవ్విపోతారు.

అయితే ఆ కండిషన్స్ నచ్చే విక్కీ కౌశల్ పెళ్లాడట. ఆమె పెట్టిన కండీషన్స్ ఏంటీ అంటే? పెళ్లికి ముందు ఎలా ఉందో.. పెళ్లి తర్వాత కూడా ఎవరి సంపాదన వారిదే.. అన్నట్టు ఉండాలని నిక్కచ్చిగా చెప్పిందట. అలాగే ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది? ఎందుకు డబ్బులు వాడుతున్నావు? అనే విషయాలు అస్సలు చర్చించకూడదట. అంతే కాకుండా స్థిరాస్తులు కొనాలన్నా.. ఇద్దరు సమాన శేర్ లో కొని.. సమానంగా పంచుకోవాలి అని కండీషన్ పెట్టిందట. అలాగే అమ్మడు డబ్బులు ఖర్చు చేస్తున్నపుడు ఎందుకు? అని అడగకూడదట. పెత్తనం చెలాయించకూడదట. ఇక ఇదే విషయాలు తనకీ వర్తిస్తాయని చెప్పుకొచ్చిందట మన మల్లీశ్వరి.

Share post:

Latest