ఎరుపురంగు చీరలో వగలు పోతున్న ‘కార్తీకదీపం’ ముద్దుగుమ్మ!

కార్తీకదీపం సీరియల్‌ గురించి వినని తెలుగు వారు ఉండనే వుండరు అంటే నమ్మశక్యం కాదేమో. ఇక ఆ సీరియల్ లో నెగిటివ్ రోల్ లో అలరిస్తున్న మోనిత గురించి మీకు తెలిసిందే. ఈ అమ్మడు ఈ సీరియల్ ద్వారా టీవీ ప్రేక్షకులకు చేరువైంది. ఈమె అసలు పేరు శోభాశెట్టి. అంతకుముందు ఆమె చాలా సీరియల్స్ లో నటించినా కార్తీకదీపంలో విలన్ గా ఆమెకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. శోభా శెట్టి 20 జనవరి 1990న బెంగుళూరులో జన్మించారు. ఆమె బాల్యం, చదువు అక్కడే నడిచింది. దావణగెరెలోని బాపూజీ హైస్కూల్‌లో చదివింది. గ్రాడ్యుయేషన్‌ బెంగళూరు యూనివర్సిటీలో చేసింది.
Dr
చిన్నప్పటి నుంచి నటన పట్ల మక్కువ ఉండటంతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది. దానికి ముందు ఆమె ATSIT, ఇస్మాలియాలో కొంతకాలం వర్క్ చేసింది. శోభ తల్లిదండ్రులు రతనమ్మ – మంజు శెట్టి రవి. అలాగే ఆమెకు అన్నయ్య, ఒక అక్క ఉన్నారు. వారిద్దరూ జాబ్స్ లో స్థిర పడ్డారు. కానీ శోభ మాత్రం బుల్లితెర రంగం వైపు వచ్చింది. ఇకపొతే కార్తీక దీపం సీరియల్ వలన ఆమె మన తెలుగువాళ్ళకు సుపరిచితురాలు అయింది.

ఆమె ఒకవైపు నటిస్తూనే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. కాగా ఆమెకి మిలియన్ల సంఖ్యలో ఫాలోయర్స్ వున్నారు. దాంతో ఎప్పటికప్పుడు రకరకాల ఫోటో షూట్లతో పిచ్చెక్కించే అందాలను ఒలకబోస్తూ కుర్రాళ్లకు కనులవిందు చేస్తుంది. త్వరలో ఆమె వెండితెరపై కూడా కనిపించనుందని టాక్ వినబడుతోంది. కాగా కార్తీక దీపం సీరియల్ ప్రస్తుతం నిరాటంకంగా సాగుతోంది. రికార్డు స్థాయిలో ఎపిసోడ్స్ రన్ అవుతున్నాయి. ఇటీవలి కాలంలో లాంగ్ రన్ లో సాగుతున్న ఏకైక సీరియల్ ఏదన్నా వుంది అంటే అది కార్తీకదీపమే అని చెప్పవచ్చు .