చినరాజప్పపై కమ్మ అస్త్రం..పెద్దాపురంలో సాధ్యమేనా?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీలో ఉండే సీనియర్ నేతల్లో మాజీ హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా ఒకరు. కింది స్థాయి కార్యకర్త నుంచి అంచలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. ఇదే క్రమంలో 2014లో పెద్దాపురం సీటు దక్కింది..ఆ ఎన్నికల్లో గెలిచిన రాజప్పకు చంద్రబాబు హోమ్ మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్ ఉన్నా, జనసేన దాదాపు 25 వేల ఓట్లు చీల్చిన సరే రాజప్ప 4 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఇక ప్రతిపక్షంలో ఉన్నా కూడా దూకుడుగా ఉంటున్నారు..బాబుకు ఎల్లప్పుడు అండగా ఉంటున్నారు..మళ్ళీ పెద్దాపురంలో గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. బాబుతో ఎంతో సన్నిహితంగా ఉండే రాజప్పని సైడ్ చేసి..పెద్దాపురం సీటు వేరే వాళ్ళకు ఇచ్చే ఛాన్స్ కూడా ఉండదు. కానీ తాజాగా మాత్రం పెద్దాపురం సీటు ఓ కమ్మ నేతకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. రాజప్ప పోటీ చేయక ముందు నుంచి ఇది కమ్మ నేతల చేతుల్లోనే ఉండేది. బొడ్డు భాస్కర రామారావు టీడీపీ నుంచి గెలిచిన నేత.

అయితే ఆయన్ని 2014లో సైడ్ చేసి రాజప్పకు సీటు ఇచ్చారు..ఇక వరుసగా గెలవడంతో పెద్దాపురంలో రాజప్పకు తిరుగులేదనే పరిస్తితి. ఇక బొడ్డు రామారావు కూడా చనిపోయారు. కానీ ఇటీవల మరోసారి పెద్దాపురంలో కమ్మ నినాదం పెరుగుతుంది. ఈ సీటు కోసం గుణ్ణం చంద్రమౌళి ట్రై చేస్తున్నారని తెలిసింది. ఆయన కూడా పెద్దాపురం రేసులో ఉన్నారట.

ఇక్కడ ఉండే కమ్మ వర్గం వారు చంద్రమౌళికి సీటు ఇవ్వాలనే డిమాండ్ చేస్తున్నారు. కానీ చంద్రబాబు రాజప్పని కాదని కమ్మ నేతకు సీటు ఇవ్వడం అనేది చాలా కష్టమైన పని, ఆయన్ని మార్చే సాహసం చేయరనే చెప్పొచ్చు. ఒకవేళ రాజప్పకు వేరే సేఫ్ సీటు చూపిస్తే మార్చే ఛాన్స్ ఉంటుంది. మరి చూడాలి పెద్దాపురం రాజకీయం ఎలా ఉంటుందో.

Share post:

Latest