జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ ఆదాయం.. ఒక్కో పోస్ట్‌కు ఎంత‌ ఛార్జ్ చేస్తుందో తెలుసా?

దివంగత నటి శ్రీదేవి-బాలీవుడ్ బడా నిర్మాత బోని కపూర్ ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు.. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. అలాగే సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు.
తరచూ మోడ్రన్ డ్రెస్సెస్ లో అందాలన్నీ ఆర‌బోస్తూ కుర్ర‌కారుకు నిద్ర పట్టకుండా చేస్తుంటుంది. గ్లామర్ షో తోనే ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్ లో ఏకంగా 20.5 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జాన్వీ కపూర్ పలు టాప్ బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంటుంది. ఇలా ఆయా బ్రాండ్ ల‌ని ప్రమోట్ చేస్తూ పెట్టే పోస్ట్ కు జాన్వీ ఎంత ఛార్జ్ చేస్తుందో తెలిస్తే కళ్ళు తేలేస్తారు.
ఒక్క పోస్ట్ కి ఆమె రూ. 70 లక్షల నుంచి 80 లక్షల వరకు పుచ్చుకుంటుందట. ఇక ఆమెకున్న ఫాలోయింగ్ దృష్ట్యా సదరు బ్రాండ్ నిర్వాహకులు సైతం జాన్వీకి అంత మొత్తం ఇచ్చేందుకు ఏమాత్రం వెనకాడరని అంటున్నారు. మొత్తానికి ఇన్స్టాగ్రామ్ ద్వారా భారీ ఆదాయాన్ని జాన్వీ వెనకేసుకుంటుంది. కాగా, రీసెంట్‌గా ఈ బ్యూటీ `మిలీ` సినిమాతో నార్త్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. అయితే ఈ చిత్రం పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

Share post:

Latest