జగన్ కొత్త కోణం..రివర్స్ అవ్వనుందా?

రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారుతున్న విషయం తెలిసిందే. అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో…టీడీపీ-జనసేనలు కలిసి బరిలో దిగడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటివరకు తిరుగులేని పొజిషన్‌లో ఉన్నా వైసీపీకి..టీడీపీ-జనసేన పొత్తు వల్ల ప్రమాదం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. ఇందులో కాస్త వాస్తవం ఉంది కూడా.

రెండు పార్టీలు విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరుగుతుంది..కానీ టీడీపీ-జనసేన కలిస్తే వైసీపీకే నష్టమే ఉంటుంది. అయితే ఈ విషయంలో జగన్ మరొక కోణం ఆలోచిస్తున్నారట. చంద్రబాబు-పవన్ కలిస్తే తనకే బెనిఫిట్ అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. 2009 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో టీడీపీ, టీఆర్ఎస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసినా సరే…కాంగ్రెస్ గెలిచింది.

అదే తరహాలో ఇప్పుడు టీడీపీ-జనసేన కలిసినా తనకే బెనిఫిట్ అవుతుందని భావిస్తున్నారట. ఎందుకంటే పవన్‌కు కాపుల మద్ధతు పూర్తి స్థాయిలో ఉండదని, అలాగే బాబు సీఎం అవుతారు తప్ప..పవన్ సీఎం అవ్వరనే అసంతృప్తి కాపుల్లో ఉంటుందని, ఇటు ఎలాగో టీడీపీ కొన్ని సీట్లు జనసేనకు వదులుతుంది..అప్పుడు కొందరు టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉంటారని, టీడీపీ ఓటర్లు..జనసేనకు ఓటు వేయరని భావిస్తున్నారు..ఓవరాల్ గా తమకే బెనిఫిట్ అవుతుందని జగన్ అనుకుంటున్నారట. అంటే టీడీపీ-జనసేన కలిసిన తమకు నష్టం లేదని ఊహిస్తున్నారు. అయితే ఇదంతా ఊహాజనితమే తప్ప.. నిజమయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి.

ఒకవేళ నష్టం లేదని జగన్ భావిస్తున్నారో లేదో తెలియదు గాని..కొందరు వైసీపీ నేతలు మాత్రం టెన్షన్ పడుతున్నారు. 2009లో ప్రజారాజ్యం సెపరేట్‌గా ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది . కానీ ఇప్పుడు అలా సెపరేట్ గా బలమైన పార్టీ పోటీ చేయడం లేదు. కాబట్టి టీడీపీ-జనసేన కలిస్తే ఖచ్చితంగా వైసీపీకి నష్టమే. అలాగే అటు టీడీపీ శ్రేణులైన, ఇటు జనసేన శ్రేణులైన సరే…త్యాగాలకు రెడీగా ఉన్నారు. ఎలాగైనా వైసీపీనే గద్దె దించడమే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. కాబట్టి ఏదైనా వైసీపీకే రిస్క్ ఉంటుందని చెప్పొచ్చు.

Share post:

Latest