జబర్దస్త్ లో పారితోషకం మరీ అంతనా? షాకింగ్ విషయాలు చెప్పిన కమెడియన్!

తెలుగు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వుండరు. దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు ప్రేక్షకులందరికీ కామెడీని పంచడంలో జబర్దస్త్ పాత్ర అంతాఇంతా కాదు. అంతేకాకుండా ఈ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన వారు ఎందరో వున్నారు. అలా పాపులారిటీ సంపాదించి సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం ఎంతో మంది బిజీగా మారారు. అలాగే జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి ఆ తర్వాత వేరే షోలకు వెళ్ళిన వారు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు.

అలా జబర్దస్త్ ద్వారా బాగా గుర్తింపు పొందిన ఆర్టిస్ట్ లలో ఆనంద్ ఒకరు. ఆనంద్ ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ షో గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. చమ్మక్ చంద్ర టీం లో కంటెస్టెంట్ గా చేసిన ఆనంద్ చమ్మక్ చంద్ర జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత టీం లీడర్ ఎదిగి చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే అతను చేసిన కొన్ని స్కిట్ లకి పెద్దగా రేటింగ్స్ రాకపోవడంతో చివరికి అతన్ని తీసేసి పక్కకు పెట్టారు మల్లెమాల యాజమాన్యం. అయితే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక ఆనంద్ చాలా కష్టాలను పడ్డాడట.

ఈ నేపథ్యంలో జబర్దస్త్ టీం లీడర్స్ పారితోషకం గురించి ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీం లీడర్లు వేసే స్కిట్ కి వచ్చే రేటింగ్స్ ను బట్టే ఇక వారి రెమ్యూనరేషన్ డిసైడ్ అవుతుందని చెప్పుకొచ్చాడు. ఇక సుడిగాలి సుదీర్ లాంటి వారికి లక్షల్లో రెమ్యూనరేషన్ ఉంటుందని అన్నాడు. అయితే వాళ్ల టీం లో పనిచేసే కంటెస్టెంట్లకు మాత్రం 10000 నుంచి 20000 వరకు పారితోషకం ఇస్తారని అన్నాడు. ఆనంద్ విషయానికొస్తే జబర్దస్త్ లో మొదట్లో కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారని, చంద్ర టీంలోకి వచ్చిన తర్వాత ఒక్క స్కిట్ కి 15000 వరకు పారితోషికం ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు.

Share post:

Latest