రష్మీక – రిషబ్ శెట్టి మధ్య గొడవలకు అసలు కారణం ఇదేనా..?

టాలీవుడ్ లో హీరోయిన్ రష్మిక నేషనల్ క్రష్ గా పేరు సంపాదించింది. మొదట ఛలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించింది. దీంతో బాలీవుడ్ లో కూడా కొన్ని అవకాశాలను అందుకుంది. రష్మీక బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో బాలీవుడ్లో సక్సెస్ కావడం లేదని చెప్పవచ్చు.తాజాగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన కన్నడ చిత్రం కాంతారా నటుడు డైరెక్టర్ రిషబ్ శెట్టి మంచి పాపులారిటీ సంపాదించారు . ఇప్పుడు పలు ఆసక్తికరమైన కామెంట్లు చేయడంతో మళ్లీ రష్మికపై ట్రోల్ జరుగుతోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.

Rashmika & Rakshit Shetty Enjoying Kannada Director Rishab Shetty's  Hilarious Fun - YouTube

ఒక ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ సాయి పల్లవి ,రష్మిక ఇలా విభిన్నమైన హీరోయిన్స్లలో మీరు ఎవరితో నటించాలనుకుంటారని ప్రశ్న రిషబ్ శెట్టిని అడగక.. అందుకు సమంతతో నటించాలని ఉందని అలాగే సాయి పల్లవి కూడా మంచి యాక్టర్ అని తెలిపారు. అయితే రష్మిక పేరు చెప్పకుండా.. రష్మిక గతంలో రెండు చేతులతో సిగ్నల్స్ ను ఇమిటేట్ చేస్తూ అలాంటి యాక్టర్ తో నటించలేనని చెప్పేశారు.

వీలైనంతవరకు కొత్త వారితోనే నటించాలనుకుంటానని తెలియజేశారు. రష్మికను కిరాక్ పార్టీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా రిషబ్ శెట్టి. అయితే రష్మిక మాత్రం ఒక మ్యాగజైన్ కవర్ మీద తన స్టిల్ చూసి తనకి మొదటి సినిమా అవకాశం వచ్చిందని చెప్పింది. కానీ కాంతార చిత్రం సక్సెస్ అయితే రష్మిక అసలు స్పందించలేదు. ఇక తన సొంత భాష కన్నడ సినిమాను రష్మిక లెక్క చేయడం లేదని పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. అందుచేతను ఇలా రిషబ్ శెట్టి గట్టి కౌంటర్ ఇచ్చారని అభిమానుల సైతం తెలియజేస్తున్నారు. దీంతో మళ్లీ రష్మిక పైన ట్రోల్ మొదలవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Share post:

Latest