సుధీర్ గాలోడు సినిమాతో సక్సెస్ అయ్యారా..!!

జబర్దస్త్ కమెడియన్స్ గా గత కొంతకాలంగా పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం సినిమాలలో హీరోగా నటిస్తూ ఉన్నారు.అలా సుడిగాలి సుదీర్ కూడా ఇప్పటివరకు పలు చిత్రాలలో హీరోగా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మరొకసారి గాలోడు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Gaalodu | Telugu Movie News - Times of India

కథ విషయానికి వస్తే..
సుధీర్ (రాజు) అనే పాత్రలో ఒక పల్లెటూరు అబ్బాయిగా కనిపిస్తాడు. అలా ఆ ఊరిలోనే ఆకతాయిక తిరుగుతూ ఉంటాడు ఒకరోజు పేకాట లో ఆ ఊరి సర్పంచ్ కొడుకు పైన చేయి చేసుకోవడంతో అతను మరణిస్తాడు.. అటు తరువాత మా ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయి హైదరాబాదులో తలదాక్కుంటాడు రాజు. అక్కడే కాలేజ్ స్టూడెంట్ శుక్లా (గేహన సిప్పి) పరిచయమవుతుంది. అలా ఆకతాయిల నుంచి శుక్లా ను రక్షించడంతో ఆమె తన తండ్రికి చెప్పి తన ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగంలో చేర్పిస్తుంది.

ఇక అటు తర్వాత వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అలాంటి సమయంలోనే .. రాజు తన సొంత ఊరులో హత్య చేసిన కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ హైదరాబాద్ కి వస్తారు. ఆ తర్వాత ఆ హత్య కేసులో శిక్ష పడిన రాజు జైలు నుంచి ఎలా బయటికి వస్తారు.. అ తర్వాత నిర్దోషిగా ఎలా నిరుపించుకుంటారనే కథ అంశంతో ఈ చిత్రాన్ని తరిగించారు.

దర్శక నిర్మాత రాజశేఖరరెడ్డి పులిచెర్ల ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సరికొత్త ఎలివేషన్స్ ఏవి కూడా కనిపించలేదు. గతంలో సుడిగాలి సుదీర్ తో కలిసి సాఫ్ట్వేర్ సుధీర్ అనే సినిమాని తెరకెక్కించారు ఆ బంధంతోనే ఇప్పుడు ఈ గాలోడు సినిమాని తెరకెక్కించగా పెద్దగా ఆకట్టుకోలేదని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు.

రొటీన్ కథ కావడం మేకాకుండా ఈ తరం ఆడియన్స్ను పెద్దగా మెప్పించలేకపోయింది ఈ చిత్రం.ఇందులోని కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ జబర్దస్త్ కామెడీ సీన్స్ ని గుర్తు చేసేలా ఉన్నాయని పలువురు కామెంట్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో సుధీర్ పాత్ర కూడా పెద్దగా లేదని.. కేవలం సుదీర్ పాత్రలన్ని ఇందులో బిల్డప్ గానే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ చూడడానికి బాగానే ఉన్న నటనపరంగా పెద్దగా ఆకట్టుకోలేదని తెలుస్తోంది. ఎంతోమంది నటించినా షకలక శంకర్ కామెడీని ఈ సినిమాకి కాస్త ప్లస్ అయిందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్..
యాక్షన్ సీన్స్
కెమెరా పనితనం
ఆకట్టుకునే సంభాషణలు

మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ సన్నివేశాలు
మితిమీరిన బిల్డప్ సన్నివేశాలు
సన్నివేశాలకు సంబంధం లేకుండా వచ్చే కామెడీ.

మొత్తానికి ఏ సినిమాతో సుడిగాలి సుదీర్ మరొక ప్రాపని చవి చూశారని తెలుస్తోంది. మరి ఏ మేరకు అలరిస్తారో చూడాలి.

Share post:

Latest