ప్రాజెక్ట్-k లో రాంగోపాల్ వర్మ గెస్ట్ రోల్ నిజమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించారని చెప్పవచ్చు. ముఖ్యంగా నాగార్జున నటించిన శివ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం కావడమే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీకి సరికొత్త ట్రెండ్ ని శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్ర దర్శకుడుగా కూడా చలామణి అయ్యారు. ఆ పేరుతోనే బాలీవుడ్ లో కూడా పలు సినిమాలను తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో వర్మ నుంచి సరైన సినిమా ఒకటి కూడా రాలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బోల్డ్ సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు వర్మ.

Ram Gopal Varma finds Prabhas' look-a-like | GOSSIP | NYOOOZ ENTERTAINMENTఇక తన కథలతో పలు వివాదాలలో చిక్కుకుంటూనే ఉన్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా పలు అంశాలపై స్పందిస్తూ వివాదాలలో నిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం వర్మ చేతిలో కేవలం రెండు చిత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అది కూడా ప్రభాస్ సినిమా కావడం విశేషమని చెప్పవచ్చు. ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కే సినిమా వస్తున్న సంగతి అందరికీ తెలిసింది. చిత్రంలో వర్మ ను కూడా క్యామియో రోల్ కోసం సంప్రదిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అందుకోసం వర్మ కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో వర్మ తన గెస్ట్ రోల్ కి సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాదులో భారీ సెట్స్ ను నిర్మించారు చిత్ర బృందం. ఇందులో దీపికా పదుకొనే ,అమితాబచ్చన్ తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. మరి వర్మ ఈ చిత్రంలో నటిస్తున్నాడా లేదా అనే విషయంపై చిత్ర బృందం క్లారిటీ ఇస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కామెంట్లు రూపంలో తెలియజేస్తున్నారు.

Share post:

Latest