టీడీపీ-జనసేనతో బీజేపీ..సీట్ల లెక్కలు చేంజ్?

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయిపోయిందని చెప్పొచ్చు…వైసీపీకి చెక్ పెట్టడానికి ఆ రెండు పార్టీలు కలుస్తున్నాయి. ఇటీవల చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీ బట్టి…వారి పొత్తు ఖాయమని అర్ధమైంది. కాకపోతే అధికారికంగా మాత్రం పొత్తు గురించి, సీట్ల గురించి ఎలాంటి ప్రకటన లేదు. ఎన్నికల ముందే పొత్తు గురించే అధికారికంగా ప్రకటన రానుంది. అయితే ఈలోపు పొత్తుకు సంబంధించిన సీట్ల లెక్కల గురించి, బీజేపీతో కలవడం గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి.

వాస్తవానికి ఏపీలో బీజేపీ బలం శూన్యం. ఆ పార్టీకి ఒక శాతం ఓట్లు లేవు. ఒక సీటు గెలుచుకునే బలం లేదు. కానీ ఆ పార్టీ అవసరం టీడీపీకి గాని, వైసీపీకి గాని ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఆ పార్టీనే అధికారంలో ఉంది. కేంద్రంలో ఉన్న పార్టీతో పొత్తు ఉంటే వ్యవస్థల సపోర్ట్ ఉంటుందనేది వైసీపీ, టీడీపీలో ఉంది. 2019 ఎన్నికల్లో చంద్రబాబుపై కోపంతో బీజేపీ..ఏ విధంగా జగన్‌కు పరోక్షంగా సహకరించిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు టీడీపీకి చుక్కలు చూపించారు.

కాబట్టి చంద్రబాబు…బీజేపీ సపోర్ట్ కూడా ఉండాలని కోరుకుంటుంది. అటు బీజేపీ సైతం నాలుగైదు సీట్లు గెలుచుకోవాలంటే టీడీపీతో కలిస్తేనే బెటర్ అని చూస్తుంది. అయితే టీడీపీతో కలవడం కొందరు బీజేపీ నేతలకు ఇష్టం లేదు. అదే సమయంలో బీజేపీతో కలవడం టీడీపీ శ్రేణులకు ఏ మాత్రం ఇష్టం లేదు. కాకపోతే అధినేత ఏది చెబితే అది చేయడానికి రెడీగా ఉన్నారు.

కేంద్రం సపోర్ట్ కావాలి కాబట్టి టీడీపీ..జనసేనతో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీకి 4 ఎమ్మెల్యే, 4 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. అటు జనసేనకు 22-25 ఎమ్మెల్యే సీట్లు, 5-6 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం ఉంది. కానీ జనసేన 40 వరకు సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా గాని టీడీపీ-జనసేనలతో బీజేపీ కలిసేలా ఉంది.

Share post:

Latest