అనుష్క శెట్టి.. ఇండస్ట్రీలో అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఈమె చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని ఇప్పటికే ఎంతోమంది స్టార్ నటీనటులు కూడా తెలియజేశారు. స్టార్ హీరోల సరసన గ్లామర్ పాత్రలే కాకుండా లీడ్ రోల్ లో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో మరింత మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ కూడా ఈమె.. అలా అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, జీరో సైజ్ వంటి సినిమాలలో తన పర్ఫామెన్స్ తో సూపర్ గా అదరగొట్టింది. వేదం సినిమాలో వ్యాంప్ క్యారెక్టర్ లో నటించి మరింతగా మెప్పించింది. బాహుబలి సినిమాలో దేవసేనగా పాత్రకు ప్రాణం పోసింది . ఇలా ఒక్కటేమిటి గ్లామర్ రోల్స్ అయినా డీ గ్లామర్ రోల్స్ అయినా అనుష్క చేస్తే అది అదిరిపోవాల్సిందే అన్నట్టుగా తన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉండగా ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టితో ఒక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అనుష్క కి సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేశారు. అందులో ఆమె చెఫ్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు మనం చూడవచ్చు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన అనుష్క బిల్లా సినిమా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డానని వెల్లడించింది. సాధారణంగా ఎవరైనా సరే నేను ఇలానే ఉంటాను.. ఇలాంటి పాత్రలే చేస్తాను అని కొన్ని నిబంధనలు పెట్టుకుంటూ ఉంటారు . కానీ ఒక స్టేజ్ కు వచ్చిన తర్వాత ఆ నిబంధనలను చెరిపేయాల్సి ఉంటుంది.
ఒక్కసారి కమిట్మెంట్ తీసుకుంటే పాత్ర ఎలాంటిదైనా సరే చేయాల్సి ఉంటుంది. అనుష్క విషయంలో కూడా ఇదే జరిగిందట. తాను బిల్లా సినిమాలో బికినీ వేసుకోవడం వల్ల ఇబ్బందులు పడ్డానని తెలియజేసింది . అరుంధతి వంటి హుందా పాత్ర చేసిన తర్వాత “ప్రభాస్ తో నటించిన బిల్లా సినిమాలో గ్లామరస్ రోల్స్ చేయడం చాలా సాహసం అని, అయితే మొదటిసారిగా ఈ సినిమా కోసం బికినీ వేసుకున్నానని.. ఒక్కసారిగా బికినీలో నా శరీరాన్ని మొత్తం చూపించడం చాలా అవమానంగా అనిపించింది..ఇదే నా జీవితంలో ఇబ్బందులు పడ్డ క్షణాలు ఇవే.. ” అంటూ అనుష్క ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించింది. అయితే పాత్ర కోసం బికినీ ధరించినప్పటికీ ఈమె బయట చాలా హుందాగా శరీరం కనపడకుండా డ్రెస్సులు ధరిస్తూ అందరికీ ఆరాధ్య దేవతగా మిగిలిపోయింది.