హీరోయిన్ తాప్సీ కెరియర్ .. అయిపోయినట్టేనా..వాటికే పరిమితమా..!!

టాలీవుడ్లో మొదట ఝుమ్మంది నాదం చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ తాప్సీ పన్ను.. ఇక తర్వాత ప్రభాస్ తో రవితేజతో కలిసి కొన్ని సినిమాలలో నటించిన పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అక్కడ అడుగుపెట్టగా అక్కడే సెటిల్ అయిపోయింది.అప్పుడప్పుడు పలు వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది తాప్సి.బాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

What are the hottest pictures of Taapsee Pannu? - Quora

రీసెంట్ గా తాప్సి నటించిన సినిమాలన్నీ కూడా ఓటీటి లోనే విడుదలవుతున్నాయి. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఫ్యూచర్ కష్టాలలో పడిందని వార్తలు బాగా వైరల్ గా మారుతున్నాయి. తాప్సి కోవిడ్ ముందు వరకు బాగానే తన కెరీర్ను సాగించిన కోవిడ్ తర్వాత ఈమెకు అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. అయితే వచ్చిన సినిమాలన్నీ కూడా ఓటేటిలోనే విడుదలవుతున్నాయి. అడపాదప సినిమాలు థియేటర్లలో విడుదలైన పెద్దగా వర్కౌట్ కాలేదు దీంతో ఈమె కెరియర్ క్లైమాక్స్ వచ్చినట్లే అని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

కరోనాకు ముందు బద్ల, మిషన్ మంగల్, తప్పడ్ వంటి సినిమాలతో బాగానే ఆకట్టుకుంది తాప్సి. కరోనా సమయంలో థియేటర్లో బ్రేకులు పడడంతో హాసిన్ దిల్రూబా చిత్రం డిజిటల్ ఆడియన్స్ ముందుకు వచ్చిన సక్సెస్ సాధించింది. ఈ చిత్రం ఓటిటిలో విడుదల బాగానే ఆకట్టుకుంది.అదే జోరుతో రష్మీ రాకెట్, లుప్ల పెట్ట, వంటి డిఫరెంట్ సినిమాలు చేసిన తాప్సి ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈమె కెరియర్ డేంజర్ జోన్ లో ఉందని బాలీవుడ్ ప్రేక్షకుల సైతం తెలియజేస్తున్నారు. ఆ తర్వాత మిషన్ ఇంపాజిబుల్, శభాష్ మిధు వంటి చిత్రాలు థియేటర్లో విడుదలైన సక్సెస్ కాలేకపోయాయి. తాప్సి కెరియర్ నిలబడాలి అంటే బ్లర్ సినిమా సక్సెస్ సాధించాలి లేకపోతే ఈ అమ్మడు కెరియర్ ముగిసినట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Latest