సినిమాలకు గుడ్ బై చెప్పనున్న నాగచైతన్య హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో నాగచైతన్యతో కలిసి నటించిన హీరోయిన్లలో నిధి అగర్వాల్ కూడా ఒకరు. మొదట సవ్యసాచి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది నిధి అగర్వాల్. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోవడంతో అంతంత మాత్రమే అవకాశాలు వచ్చాయి ఈ ముద్దుగుమ్మకు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

nidhhi agerwal: Physically it is a big challenge .. Nidhi Agarwal openly  said! Ismart Beauty Crazy Feelings - harihara veeramallu: heroine nidhhi  agerwal comments viral » Jsnewstimes

ఇదంతా ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా నిధి అగర్వాల్ కోలీవుడ్లో పలు రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్ హీరో శింబు తో నిధి అగర్వాల్ వివాహం జరుగబోతోందని వార్తలు వైరల్ గా మాట్లాడడంతో ఈమె క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే నిధి అగర్వాల్ శింబు పై వచ్చిన రూమర్లకి తమిళ హీరో ఉదయనిది కూడా అవుననే విధంగా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఉదయనిధి నటించిన తాజా చిత్రం కలగా తలైవన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నిధి అగర్వాల్ నటిస్తోంది.ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఉదయనిధి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Picture 1783978 | Nidhi Agarwal Latest Photos

ఉదయనిధి మాట్లాడుతూ నిధి అగర్వాల్ ఈ చిత్రంలో చాలా కష్టపడింది.. నాకంటే ఎక్కువగా ఈ సినిమాలో ఆమెకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. యాక్షన్ సీన్ల కోసం నిధి అగర్వాల్ ఎన్నో దెబ్బలను కూడా తిన్నది.ఈ చిత్రం ఆమెకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నట్లుగా తెలియజేశారు. రాబోయే రోజుల్లో నిధి అగర్వాల్ తమిళ చిత్రాలలో నటిస్తుందో లేదో అని కూడా హింట్ ఇవ్వడం జరిగింది. అయితే ఉదయనిధి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఉదయనధి ఎందుకు ఇలా మాట్లాడారు.. నిధి అగర్వాల్ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పు నందు అనే అనుమానాలు కూడా అభిమానుల్లో మొదలవుతున్నాయి. మరి ఏ విషయం అన్నది నీది అగర్వాల్ క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Share post:

Latest