కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా హీరో నాగశౌర్య వివాహం.. వీడియో వైరల్.!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఛలో సినిమా ద్వారా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య అంతకుముందు పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు లభించలేదని చెప్పాలి. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ పర్వాలేదనిపించుకుంటున్న నాగశౌర్య తాజాగా కృష్ణ వ్రింద విహారి సినిమాతో యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. పెళ్లెప్పుడు చేసుకుంటాడు అని అందరూ అనుకుంటున్నట్టుగానే ఎవరు ఊహించని విధంగా సడన్గా తన పెళ్లి డేట్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు.

అయితే ఈరోజు ఎట్టకేలకు బెంగళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టి ని వివాహం చేసుకున్నారు. తాజాగా నాగశౌర్య అనూష శెట్టి మెడలో మూడు ముళ్ళు వేసి ఓ ఇంటి వాడు అయ్యాడని చెప్పవచ్చు. బెంగళూరులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యుల పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు . అంతేకాదు వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. తలంబ్రాలు పోసుకుంటూ చాలా సందడిగా ఒకరి తర్వాత ఒకరు చాలా ఉత్సాహంగా కనిపించారు.

ప్రస్తుతం ఈ జంటకు అటు సినీ సెలబ్రిటీలతోపాటు ఇటు అభిమానులు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నాగశౌర్య తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా హీరో నాగ శౌర్య ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టి కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాడు.

Share post:

Latest