మిత్రులైన సరే వార్ తప్పడం లేదా..?

వచ్చేయేడాదికి సంక్రాంతి కి చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇదే సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇక ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద రచ్చ చేయడమే అంటూ అభిమానులు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈసారి సంక్రాంతి కాస్త కఠినమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక చిరంజీవి నటిస్తున్న మరొక చిత్రం భోళా శంకరుడు సినిమాను సమ్మర్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

When Superstar Rajinikanth Inspired Megastar Chiranjeevi - Filmibeatఅందుకోసం ఒక మంచి తేదీని కూడా అనుకుంటున్నాట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే తేదీకి తమిళంలో సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ నటిస్తున్న జైలర్ చిత్రం కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం. తమిళంలో రూపొందించిన జైలర్ చిత్రంకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఈ సినిమాతో చాలాకాలంగా ఎదురుచూస్తున్న రజనీకాంత్ సక్సెస్ కు దోహదపడుతుందని అభిమానుల సైతం చాలా నమ్మకంగా ఉన్నారు.ఈ నేపథ్యంలోనే భోళా శంకరుడు, జైలర్ సినిమాలు ఢీకొట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది ఇండస్ట్రీలో.

భోళా శంకర్ కు జైలర్ సవాల్ -రజనీకాంత్ చిరంజీవి ఇద్దరు మంచి స్నేహితులని అందరికీ తెలిసిన విషయమే వీరిద్దరూ కూడా పలు సందర్భాలలో కలిసి సందడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకేసారి రాబోతున్న నేపథ్యంలో ఎవరిది పై చేయి ఉంటుందని విషయం అభిమానులు చాలా ఆసక్తిగా ఉంటోంది. ఈ మధ్యకాలంలో రజనీకాంత్ సినిమాలు పెద్దగా సందడి చేయలేకపోతున్నాయి కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం డైరెక్ట్ తెలుగు సినిమాలు కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్నాయి.. కనుక భోళా శంకర్ సినిమాకు రిస్క్ తప్పదేమో అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి మెగా అభిమానులు కూడా ఈ సినిమా పైన చిరంజీవికి, డైరెక్టర్ మెహర్ రమేష్ చాలా దృఢమైన నమ్మకంతోని విడుదల చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Share post:

Latest