మీనా రెండో వివాహం పై క్లారిటీ ఇచ్చిన స్నేహితులు..!!

టాలీవుడ్ లో ఒకప్పటి హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు పొందింది నటి మీనా. ఈమె భర్త విద్యాసాగర్ అనారోగ్య కారణంగా మృతి చెందడం జరిగింది. కరోనా కారణంగా ఆయన అరోగ్యం తీవ్రంగా చెడిపోవడంతో పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్తో ఆయన చనిపోయినట్లుగా అప్పట్లో ప్రకటించడం జరిగింది. ఇక తన భర్త మృతి చెందిన విషాదంలో చాలా తీవ్రంగా కూరుకుపోయిన మీనా ఇప్పుడిప్పుడే కాస్త బయట పడుతోందని చెప్పవచ్చు. ప్రస్తుతం అంతా సర్దు మునిగింది అనుకునే లోపు మళ్ళీ ఇప్పుడు మీనా పైనే పలు రూమర్లు వినిపిస్తున్నాయి.వాటిపైన మీనా స్నేహితుల స్పందించడం జరిగింది వారి గురించి తెలుసుకుందాం.

Vidyasagar Death News: South star Meena's husband Vidyasagar dies of lung  ailment; Khushbu, Venkatesh & Sarath Kumar express grief - The Economic  Timesప్రస్తుతం మీనా వయసు 46 సంవత్సరాలు. ఆమెకు ఒక పాప కూడా ఉన్నది. మీనా ఒకటే ఇబ్బంది పడడం కంటే మరో వ్యక్తిని వివాహం చేసుకోవడం మంచిదని మీనా తల్లిదండ్రులు ఆమెకు బలవంతం చేసి వివాహానికి ఒప్పించారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. మీనా కు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం తో మీనా రెండోవ వివాహం చేసుకునేందుకు సిద్ధమైంది అని ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే ఆమె కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధమైంది అని వార్తలు కోలీవుడ్ మీడియా నుంచి బాగా వినిపించాయి.

మీనా స్నేహితులు మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ ఇవన్నీ కేవలం ఒట్టి పుకార్లే మీనా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందిన మేరకు ప్రస్తుతం మీనా ఎలాంటి పెళ్లి చేసుకొని ఉద్దేశం లేదని ఆమె తల్లిదండ్రులు కూడా ఈమెకు పలు నిర్ణయాలు అయితే తీసుకోలేదని.. కేవలం మీనా తన కూతుర్ని బాగా చూసుకుని పనిలో బిజీగా ఉన్నారని తెలియజేశారు. ఒకవేళ మీన అలాంటిది ఏమైనా ఉంటే కనుక స్వయంగానే ప్రకటిస్తారు తప్ప ఇలాంటి రూమర్లకు నమ్మవద్దని చెప్పి పెట్టారు మీనా స్నేహితులు.

Share post:

Latest