టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్లలో పేరు పొందిన హరి శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తరువాత ఎంతోమంది స్టార్ హీరోలతో నటించి మంచి విజయాలను అందుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా గబ్బర్ సింగ్ లాంటి సినిమా మళ్లీ రావాలని ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అనుకున్నట్లే పవన్ కళ్యాణ్, హరిశంకర్ కాంబినేషన్లో గత సంవత్సరం భవదీయుడు భగత్ సింగ్ సినిమాని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ మైత్రి మూవీ మేకర్స్ వారు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ అనుకోకుండా మధ్యలోకి బీమ్లా నాయక్ సినిమాని తీసుకురావడంతో ఈ ప్రాజెక్టు కాస్త వాయిదా పడింది. అలాగే ఇప్పుడు రాజకీయాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆ ప్రాజెక్టుని మొదలుపెట్టలేక పోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం పవన్ కళ్యాణ్ సగం షూటింగ్ పూర్తి చేసిన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయడమే చాలా కష్టంగా మారిన సమయంలో ఇప్పుడు కొత్త సినిమాలు మొదలుపెట్టడం అంటే అది కుదరదని వార్తలు కూడా వినిపించాయి. రాజకీయాలకు సమయం ఎక్కువగా కేటాయించలేకపోవడంతో ఈసారి చాలా ఇబ్బంది వస్తుందని పవన్ ఆలోచించి సినిమాలను దూరంగా పెట్టినట్లు వార్తలు వినిపించాయి. అలా చాలా కాలం నుంచి నుంచి పవన్ కళ్యాణ్ పైన పలువు రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా హరిశంకర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తానికి మైత్రి మూవీ పవన్ హరీష్ కాంబినేషన్ పై ఆశలు చిగురించాయని చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తే మళ్లీ పవన్ కళ్యాణ్ లైన్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక ట్విట్ కూడా వైరల్ గా మారుతోంది. అయితే భవదీయుడు భగత్ సింగ్ సినిమా కాకుండా మరొక కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం పైన కూడా డైరెక్టర్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
https://twitter.com/harish2you/status/1594608056394223616?s=20&t=V7oXAhbWuz9RFDNtdEsglg