ఎట్టకేలకు ఇన్ని రోజులకు అనుష్క సినిమాకు సంబంధించి అప్డేట్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. అరుంధతి రుద్రమదేవి ,భాగుమతి తదితర చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. గత కొద్ది రోజుల నుంచి అనుష్క సినిమాలు తీయడం లేదని వార్తలు గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఎట్టకేలకు సినిమాలో నటిస్తున్నట్లుగా తన సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ప్రకటించారు చిత్ర బృందం వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Title of Anushka Shetty and Naveen Polishetty film locked
ఎన్నో సంవత్సరాల గ్యాప్ తర్వాత అనుష్క శెట్టి ఇప్పుడు ఒక చిత్రంలో కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇందులో జాతి రత్నాలు నటుడు నవీన్ పోలిశెట్టి.. నటించబోతున్నాడు. అనుష్క శెట్టి కెరియర్లో ఈ చిత్రం 48వ చిత్రం. తాత్కాలికంగా అనుష్క 48 నే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రానికకి డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. యు వి క్రియేషన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈరోజు అనుష్క శెట్టి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్కుని విడుదల చేయడం జరిగింది.

ఇందులో అన్వితరవలిశెట్టి అనే పాత్రలు అనుష్క శెట్టి నటిస్తున్నట్లు తెలియజేశారు. అనుష్క ఇందులో ఒక చెప్పుగా వంట చేస్తూ కనిపిస్తున్నటువంటి ఒక ఫోటోని మనం చూడవచ్చు. ఇందులో కూడా అనుష్క శెట్టి కాస్త బొద్దుగా కనిపిస్తుంది. కానీ చూడడానికి చాలా స్టైలిష్ లుక్ లో తన పాత్రను పరిచయం చేశారు చిత్ర బృందం అని చెప్పవచ్చు. ఇకపోతే అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి పేరు కూడా కలిసి వచ్చేలా ఈ చిత్రానికి మీస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అనుష్కకు సంబంధించి ఈ అప్డేట్ రావడంతో అనుష్క అభిమానుల సైతం చాలా సంబరపడుతున్నారు.

Share post:

Latest